స‌న్ రైజ‌ర్స్ గెల‌వాల‌ని పాకిస్తాన్ లోని మ‌జీద్ ల‌లో పూజ‌లు..!!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ మరో ఓటమిని చవిచూసింది. ఇప్పటివరకు సన్ రైజర్స్ నాలుగు మ్యాచ్ లు ఆడితే మూడింటిలో ఓడిపోయింది. ఇవాళ పంజాబ్ కింగ్స్‌ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ ( Punjab Kings vs Sunrisers Hyderabad ) జట్ల మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఇందులో సన్ రైజర్స్ హైదరాబాద్ పై ( SRH) ఆరు వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. సన్ రైజర్స్ హైద‌రాబాద్ ఓటమిపాలైనందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను ( Abrar ahmed) కావ్య పాప ( Kavya Maran) కొనుగోలు చేసిన నుంచి.. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు పాకిస్తాన్ అభిమానులు సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఈ తరుణంలోనే స‌న్ రైజ‌ర్స్‌ హైదరాబాద్ ఓటమిపాలైనందుకు తట్టుకోలేకపోతున్నారు..ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో సన్రైజర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య శనివారం 17వ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ న్యూ చండీగఢ్ వేదికగా జరగగా రెండు జట్లు కూడా భారీ స్కోర్ లు నమోదు చేశాయి. ఈ మ్యాచ్ లో సన్రైజర్స్ టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో 20 ఓవర్లు వాడిన హైదరాబాద్ ఆరు వికెట్ల నష్టానికి 219 పరుగులు సాధించింది. అయితే ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో అద్భుతంగా ఆడిన పంజాబ్ కింగ్స్ 18.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేదించింది. దీంతో హైదరాబాద్ జట్టు పైన ఆర్ వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ అందుకుంది. అయితే పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడిపోయిన హైదరాబాద్… ఇప్పటి వరకు టోర్నమెంట్ లో మూడు మ్యాచ్ లలో దారుణంగా ఓడిపోయింది.

ఒకే ఒక్క మ్యాచ్ లో విజయం సాధించింది. అయితే, వరుస పరాజయాలను ఎదుర్కొంటున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును ఉద్దేశించి పాకిస్తాన్ అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. పాపం కావ్య పాప జ‌ట్టు గెల‌వాల‌ని ఎంతో ఆశ‌గా చూస్తున్నాం, కానీ వ‌రుస‌గా మూడు మ్యాచ్ లు ఓడిపోవ‌డం దారుణం అంటున్నారు. ఇక‌నైనా స‌న్ రైజ‌ర్స్ గెల‌వాల‌ని పాకిస్తాన్ లోని మ‌జీద్ ల‌లో పూజ‌లు చేస్తామ‌ని అక్క‌డి అభిమానులు కోరుతున్నారు.