ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ
(సత్యవతి రాథోడ్) చుట్టూ ఇప్పుడు పెను వివాదం ముసురుకుంది. మైక్రోఫైనాన్స్ పేరుతో కోట్ల రూపాయల వసూళ్లకు పాల్పడ్డారంటూ ఆమెపై వస్తున్న ఆరోపణలు ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి.
ఈ ఆరోపణలపై మంగ్లీ చాలా ఘాటుగా స్పందించింది. తనపై వస్తున్నవన్నీ అసత్య ప్రచారాలని, కావాలనే తన పేరును బదనాం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది..
తనను 10 కోట్ల రూపాయలకు సింగర్ మంగ్లీ మోసం చేసిందంటూ పోలీస్ కేసు పెట్టిన అడ్వకేట్ సుబ్బారావుపై మంగ్లీ తీవ్ర స్థాయిలో విరుచుకు పడింది. అతడు ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థంకావడం లేదని చెప్పింది. తనకు డబ్బు మీద అంత ఆశే ఉంటే ఆంధ్ర, తెలంగాణ ఎన్నికల్లో ప్రచారానికి రమ్మని కోట్ల రూపాయలు ఇస్తామని ఆశ పెట్టినా తాను ఆ జోలికి కూడా పోలేదన్నారు. తనకు సుబ్బారావు పలు దఫాలు ఫోన్ చేసి బెదిరింపుగా మాట్లాడేవాడని. చెప్పింది, శ్రీముఖి అంటే తనకు క్రష్ అని, ఏమిటి నీ బెట్టు అని తనను అడిగేవాడని చెప్పింది. తను పాపులర్ అయిన తరువాత బిగ్ బాస్ షో లో ఉండాలన్నది కోరికగా చెప్పేవాడని చెప్పింది. బహుశా అందుకే ఈ గొడవలు చేస్తున్నాడని తెలిపింది. నిజాలు తెలుసుకోకుండా మీడియా తనను టార్గెట్ చేయడం న్యాయం కాదని చెప్పింది..
మంగ్లీ కౌంటర్ ఎటాక్: “బిగ్ బాస్ కోసమే ఇదంతా!”.
తనపై వచ్చిన ఆరోపణలను మంగ్లీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆమె నార్సింగి పోలీస్ స్టేషన్లో లాయర్ సుబ్బారావుపై కౌంటర్ కంప్లైంట్ ఇచ్చింది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ కంటతడి పెట్టింది.
“నేను 14 ఏళ్లు కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. మైక్రోఫైనాన్స్ వ్యాపారంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ వ్యాపారులతో నా పరిచయం కేవలం స్టేజ్ పెర్ఫార్మెన్స్లకు మాత్రమే పరిమితం” అని మంగ్లీ స్పష్టం చేసింది..