కవిత నూతన పార్టీ ఏర్పాటుపై స్పందించిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.
యాంకర్…యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో నలుగురు కోఆప్షన్ సభ్యులను ఎన్నిక చేసి వారికి అభినందనలు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి..అనంతరం మీడియాతో మాట్లాడుతూ… కవిత పార్టీ ఏర్పాటు చేయడం హాస్యాస్పదమని అన్నారు. ఒక ఉద్యమ కారుడి కుమార్తెగా తనకు ఉన్న బాధ్యతను గుర్తు చేసుకోవాలని సూచించారు. తన తొలి సమావేశంలోనే తండ్రిని విమర్శించడం ద్వారా మర్యాద కోల్పోయిందని
వ్యాఖ్యానించారు..
ఉద్యమకారుడు కేసీఆర్పై విమర్శలు చేయడం బాధ కలిగించిందన్నారు. తండ్రికి గౌరవం ఇవ్వని వ్యక్తి ప్రజలకు ఎలా ఆదర్శంగా ఉంటారని ప్రశ్నించారు. కుటుంబ విభేదాలను రాజకీయాల్లోకి తీసుకురావడం సరికాదన్నారు..
మద్యం కుంభకోణం కేసులో ఇంకా క్లారిటీ రాలేదని, కేసు పూర్తిగా ముగియలేదని తెలిపారు. డబ్బులు ఉన్నాయని పార్టీ పెట్టడం వల్ల నాయకత్వం రావడం సులభం కాదన్నారు. టీఆర్ఎస్ పేరును ఉపయోగించడం కూడా హాస్యాస్పదమని విమర్శించారు..
అదేవిధంగా, తాను ఒంటరిగా పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదని వ్యాఖ్యానించారు. తండ్రిపై విమర్శలు చేయడం ద్వారా కవిత తన ప్రతిష్టను దెబ్బతీసుకుందని అన్నారు..
పార్టీ అధిష్టానం తనకు పదవి ఇస్తే, ఆ బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు.దేశాల మధ్య యుద్ధాల కారణంగా డీజిల్, పెట్రోల్ కొరత ఏర్పడిందని, యుద్ధం ముగిసిన తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని తెలిపారు.