నంద్యాల : శ్రీశైలం ఇష్టకామేశ్వరి ఆలయ సందర్శన తాత్కాలికంగా నిలిపివేత..!
*అటవీ శాఖ – చెంచు డ్రైవర్ల మధ్య వివాదమే ఈ పరిస్థితికి కారణం.*
*చెంచుల జీపులను యాత్రకు వినియోగిస్తున్న అటవీ శాఖ అధికారులు.. ఓ వ్యక్తి బైక్పై ఆలయానికి వెళ్లి రావడంతో మొదలైన వివాదం.*
*ఇష్టకామేశ్వరి ఆలయానికి వెళ్లే భక్తుల టికెట్ల రుసుమును వెనక్కి ఇచ్చేసిన సిబ్బంది.*
*వివాదం సద్దుమణిగాకే యాత్ర పున:ప్రారంభిస్తామంటున్న అటవీ శాఖ అధికారులు.
శ్రీశైలం భ్రమరాంబ సహిత మల్లీ కార్జున స్వామిని భక్తులు కొంగు బంగారంగా భావిస్తారు. ఒకే చోట అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన భ్రమరాంబ అమ్మవారు, ద్వాదశ జ్యోతిర్లింగాల్లోని ఒకటైన శివయ్య ఇద్దరు కొలువైన దివ్యమైన క్షేత్రం. అంతే కాకుండా శిఖరం దర్శనం దగ్గర అడవుల్లో ఇష్టకామేశ్వరీ అమ్మవారు కొలువై ఉన్నారు. ఇక్కడ కొలువైన ఇష్టకామేశ్వరీ అమ్మవారిని చెంచులు ఆరాధిస్తారు. ఇక్కడ అమ్మవారిని దర్శించుకుని కుంకుమ పెట్టి మనసులోని కొరిక కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే చాలా మంది అన్ని రాష్ట్రాల నలుమూలల నుంచి ఇష్టకామేశ్వరీ అమ్మవారి ఆలయంకు తరలి వస్తారు…ఇటీవల ఇష్టకామేశ్వరీ అమ్మవారి ఆలయం దగ్గర ఉండేచెంచులకు ఫారెస్ట్ సిబ్బందికి మధ్య తరచుగా గొడవలు సంభవిస్తున్నాయి. కొంత మంది అక్రమంగా టొకెన్లు లేకున్న దర్శనాలు కల్పిస్తున్నారని చెంచులు వాపోతున్నారు. డైలీ చెప్పిన దానికంటే చాలా మంది భక్తులను దర్శనాలకు అనుమతిస్తున్నారని అక్కడి వారు చెప్తున్నారు.
తాజాగా.. అటవీ శాఖ – చెంచు డ్రైవర్ల మధ్య వివాదంతో ఇష్టకామేశ్వరి ఆలయం సందర్శన నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా..చెంచుల జీపులను ఫారెస్ట్ సిబ్బంది అక్కడకు వస్తున్న భక్తుల సందర్శనకు వినియోగిస్తున్నారు. కొంత మందిని బైక్ పైన సింగిల్ గా అనుమతించడం వివాదంగా మారింది. నిబంధనలకు విరుద్దంగా ఫారెస్ట్ సిబ్బంది వ్యవహరిస్తున్నారని చెంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు..దీన్ని చెంచులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ వాగ్వాదం కాస్త పీక్స్ కు చేరడంతో ఇష్టకామేశ్వరి ఆలయంకి వెళ్లే భక్తుల టికెట్లను అటవీశాఖ అధికారులు వెనక్కిఇచ్చి వేశారు. అదే విధంగా.. వివాదం సద్దుమణిగిన తరువాత యాత్ర పునః ప్రారంభిస్తామని ఫారెస్ట్ అధికారులు స్పష్టం చేశారు..
.. A to Z అన్నిరకాల వార్తలను ఇప్పుడే మాకు అందించండి.. మీ వాట్సాప్ నెంబర్
+91 91330 57959..