తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెంచేందుకు ప్రభుత్వ నిర్ణయం..
తెలంగాణలో భూములు లేదా ఇళ్ల కొనుగోలు ఇకపై మరింత భారంగా మారనుంది. రాష్ట్ర ప్రభుత్వం భూముల మార్కెట్ విలువలను (Guideline values) సవరించేందుకు సిద్ధమవుతోంది. మే 1వ తేదీ నుంచే ఈ కొత్త ధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ ప్రతిపాదనల ప్రకారం.. పలు ప్రాంతాల్లో భూముల విలువను 50 శాతం నుండి ఏకంగా 100 శాతం వరకు పెంచే యోచనలో ఉంది. ఈ నిర్ణయంతో రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంపు డ్యూటీ భారీగా పెరిగి కొనుగోలుదారులపై అదనపు భారం పడనుంది.