పోలీస్ వ్యవస్థ ప్రశ్నార్థకమైంది.. బండి సంజయ్ ముద్దాయి అయ్యాడు.. కోర్టు అసమర్థత బయటపడింది…సీపీఐ నారాయణ.

బండి భగీరధ్‌‌ను తాము అరెస్ట్ చేశామని పోలీసులు అంటున్నారు..

నేనే పోలీస్ స్టేషన్‌కు పంపించానని బండి సంజయ్ అంటున్నాడు

దీంతో పోలీస్ వ్యవస్థ ప్రశ్నార్థకమైంది.. బండి సంజయ్ ముద్దాయి అయ్యాడు.. కోర్టు అసమర్థత బయటపడింది

నిందితుడు బండి భగీరధ్ మీద POCSO కేసు పెట్టినప్పుడు అతనిని అరెస్ట్ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసింది

ఎవరెవరినో ఎన్ కౌంటర్ చేశారు.. ఇతనిని ఎన్కౌంటర్ చేయమని చెప్పడం లేదు, కనీసం అరెస్ట్ కూడా చేయలేదు – సీపీఐ నారాయణ..

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తన ఎంపి, మంత్రి పదవులకు తక్షణమే రాజీనామా చేయాలని సీపీఐ నారాయణ గతంలో డిమాండ్ చేశారు. ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన బిజెపి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేంద్ర మంత్రి కుమారుడు బండి సాయి భగీరథ్ 17 ఏళ్ల మైనర్ బాలికను లైంగికంగా వేధించినందుకు తెలంగాణలోని బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో పోక్సో చట్టం కింద కేసు నమోదు కావడం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆయన పేర్కొన్నారు. బిజెపి హయాంలో మహిళల భద్రత గాలిలో దీపంలా మారింది. బేటీ బచావో- బేటీ పడావో వంటి నినాదాలు కేవలం ఎన్నికల ప్రసంగాలకు, ప్రచార ఆర్భాటాలకే పరిమితమయ్యాయి అని ఆరోపించారు..