POCSO కేసులో బండి భగీరథ్ స్నేహితుల విచారణ!
శనివారం రాత్రి లొంగిపోయిన బండి భగీరథ్ను, బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా, ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసుల ప్రశ్నలు
భగీరథ్ చెప్పిన విషయాలు, బాధితురాలి వాంగ్మూలంలో ఉన్న అంశాలు సరిచూసి మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి రిమాండుకు తరలించిన పోలీసులు
బాధితురాలిపై అఘాయిత్యం జరిగిన సమయంలో అక్కడే ఉన్న భగీరథ్ స్నేహితులు, ఘటన అనంతరం రాజీ కోసం ప్రయత్నించారని ఫిర్యాదులో 10 మంది పేర్లను పేర్కొన్న బాధితురాలి తల్లి
ఈ నేపథ్యంలో మరిన్ని వివరాల కోసం భగీరథ్ స్నేహితులను కూడా పోలీసులు విచారించనున్నట్లు సమాచారం…
బండి భగీరధ్పై మరో సెక్షన్ BNS 64(2)(M) సెక్షన్ నమోదు.
_బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం చేశాడని మరో సెక్షన్ను జత చేసిన పోలీసులు.
నేరం రుజువైతే పదేళ్ల జైలు శిక్ష లేదా జీవిత ఖైదు పడే అవకాశం.