ఎస్.ఐ తొలగించినందుకు ప్రజలు బానాసంచా కాల్చి సంబరాలు…!

నల్గొండ జిల్లా…..
నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం నుండి
ఎస్.ఐ ని తొలగించినందుకు మండల ప్రజలు బానాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్న మర్రిగూడ ప్రజలు…

ఎస్పి చిత్ర పటానికి పాలాభిషేకం..

మర్రిగూడ మండల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన ఎస్, ఐ మునుగాల కృష్ణారెడ్డి పై జిల్లా ఎస్,పి చర్యలు తీసుకొని మండలం నుండి తొలగించడం తో మండల ప్రజలు మండల కేంద్రం లోని మర్రిగూడ చౌరస్తలో బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం జిల్లా ఎస్ పి. చిత్ర పటానికి పాలభిషేకం చేశారు. ఎస్,ఐ కృష్ణారెడ్డి మండల లాండ్ వ్యవస్థను బ్రష్టు పట్టించి సివిల్ మరియు ఇతర కేసులలో తలదూర్చి నిరు పేద ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసాడని అమాయకపు ప్రజల మీద అక్రమ కేసులు పెట్టాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు, ఈ సమస్యను జిల్లా ఎస్, పి శరత్ చంద్ర పవార్ గుర్తించి అతని పై చర్యలు తీసుకొని మండలం నుండి తొలగించునందుకు మండల ప్రజలందరం హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా ఎస్, పి, చిత్ర పటానికి పాలభిషేకం చేశారు స్వేట్లు తినిపించుకున్నారు.