ఏపీ కడప జిల్లా పులివెందులలో విషాద ఘటన..
అనుమానాస్పద స్థితిలో భార్యాభర్తల మృతి కలకలం.
మృతులు మహేష్ నాయక్(25), దీపిక(21)గా గుర్తింపు.
చక్రాయపేట మండలం గాలివీడు క్రాస్ రోడ్డువద్ద ఘటన.
రోడ్డుపక్కన బైక్, దూరంగా పడివున్న మృతదేహాలు.
ఘటనపై స్థానికుల్లో పలు అనుమానాలు.
బైక్ నుంచి పడి మృతి చెందారని పోలీసులు వెల్లడి.
మహేష్ నాయక్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు.
ఏడాది క్రితమే ప్రేమ వివాహం చేసుకున్న జంట
వేసవి సెలవులతో స్వగ్రామానికి వెళ్లిన దంపతులు.
వ్యవసాయ పనుల్లో పాల్గొన్న మహేష్ నాయక్
ఆదివారం రాత్రి ఇంటికి వస్తుండగా ప్రమాదం
దీపిక తలకు తీవ్ర గాయాలు.. అక్కడికక్కడే మృతి.
కల్వర్ట్ కింద దూరంగా పడివున్న మహేష్ మృతదేహం.
కడుపుపై గాయం ఉండటంతో అనుమానాలు వ్యక్తం చేస్తున్న స్థానికులు.
అది రాళ్లు గుచ్చుకున్న గాయమేనని పోలీసుల వివరణ.
పోస్టుమార్టం కోసం పులివెందుల. ప్రభుత్వాసుపత్రికి మృతదేహాల తరలింపు.
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.
దీపిక తిరుపతిలో ఇంటిగ్రేటెడ్ బీఈడీ మూడో సంవత్సరం విద్యార్థిని.
దీపిక తండ్రి మాజీ బీఎస్ఎఫ్ జవాన్గా సమాచారం.
ప్రేమజంట మృతితో రెండు కుటుంబాల్లో విషాదం.