అమరావతిలో భవన నిర్మాణాల పేరిట లూటీ జరుగుతుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. హైదరాబాద్, బెంగళూరులోనూ ఇంతటి ధరలు లేవని అన్నారు. ఇక్కడ చదరపు అడుగుకు 4,500 దాటదని, కానీ అమరావతిలో మాత్రం ముప్ఫయివేలు రూపాయలు అవుతుందని జగన్ అన్నారు. ఐదు బిల్డింగ్ ల నిర్మాణానికి పదివేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని అన్నారు. పాత కాంట్రాక్టర్లకు ఎందుకు ఇచ్చారని అడిగితే చంద్రబాబుకు బీపీ పెరుగుతుందని అన్నారు. కొత్త అసెంబ్లీ, కొత్త సెక్రటేరియట్, కొత్త హైకోర్టుకు మళ్లీ భవనాలను నిర్మిస్తున్నారని అన్నారు.ఆంధ్రప్రదేశ్ లో అమరావతి పేరిట విచ్చలవిడిగా దోపిడీ జరుగుతుందని జగన్ ఫైర్ అయ్యారు. గతంలో 1200 కోట్ల రూపాయలతో తాత్కాలిక సెక్రటేరియట్ ను నిర్మించారని, ఇప్పుడు మళ్లీ కొత్త సచివాలయాన్ని నిర్మిస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకూ ఏడు భవనాల నిర్మాణానికి 14,092 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని అన్నారు. అమరావతి రహదారి నిర్మాణ పనులు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయన్నారు జగన్. జాతీయ రహదారుల నిర్మాణానికి కిలోమీటర్ కు ఇరవై నాలుగు కోట్లు ఖర్చు అవుతుందని, కానీ అమరావతిలో రోడ్ల నిర్మాణానికి 53 కోట్లు కిలోమీటర్ కు ఖర్చు పెడుతున్నారని జగన్ అన్నారు. విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ కు 69 కోట్లు కిలోమీటర్లు ఖర్చయితే.అమరావతి సీడ్ యాక్సెస్ నుంచి నేషనల్ హైవే వరకూ వారధి వద్ద కలిపే ఫ్లై ఓవర్ కు అయ్యే ఖర్చు 189 కోట్ల రూపాయలు అని జగన్ అన్నారు. అమరావతిలో కేటాయించే ప్లాట్ల కేటాయించే విధానంలో పెద్ద కుంభకోణం జరుగుతుందని అన్నారు. సామాన్య రైతులకు చెరువుల్లో, కుంటల్లో ఇచ్చి, వీరి అనుచరులకు మాత్రం మంచి స్థలాలను ఇస్తున్నారని అన్నారు. తొలుత సేకరించిన యాభై వేల ఎకరాలు సరిపోవని, మరో యాభై వేల ఎకరాలు సేకరిస్తున్నామని అంటున్నారని జగన్ మండిపడ్డారు. వీటిని ప్రశ్నిస్తుంటే బాబు గారి బీపీ పెరుగుతుందని, డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారని జగన్ అన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.