హుజూర్ నగర్ నియోజకవర్గంలో మట్టి అక్రమ రవాణాతో కొండలు, గుట్టలు కనుమరుగైపోతున్నాయి…మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి..
.సూర్యాపేట జిల్లా…
హుజుర్ నగర్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ పార్టీ రాష్ట్ర NRI సెల్ విభాగం కన్వీనర్ శానంపూడి సైదిరెడ్డి.. వారి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించి ప్రస్తుత రాజకీయాలపై తీవ్ర విమర్శలు చేశారు.
తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హుజూర్నగర్ నియోజకవర్గ మొత్తం కూడా అభివృద్ధి పాదంలో నడిచిందని అన్నారు.. ప్రజల మధ్యే ఉండి అందరికీ అందుబాటులో పనిచేశానని పేర్కొన్నారు.
స్థానిక యువతకు పరిశ్రమల్లో ట్రైనింగ్‌తో పాటు శాశ్వత ఉద్యోగాలు కల్పించామని తెలిపారు.
ప్రస్తుతం కొందరు నాయకులు ప్రజాసేవ కంటే వ్యాపారాలు, దళారీతనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు.
స్థానికంగా సమస్యలు తెలపడానికి మంత్రులను ఎమ్మెల్యేలను కలవాలంటే ప్రజలు డబ్బులు ఖర్చు చేసుకుని వెళ్లి కలవాల్సి వస్తుందని ఆరోపించారు..
తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవం కోసం జరిగిందని, కార్యకర్తలు ప్రశ్నించే ధైర్యం కలిగి ఉండాలని పిలుపునిచ్చారు..
హుజూర్‌నగర్‌లో ప్రస్తుతం “దళారుల పాలన” నడుస్తోందని ఆరోపించారు.
ఇటీవల చింతలపాలెం మండలం లో కృష్ణాపురంలో దాడులు జరిగిన ఆ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి అరెస్టులు జరగలేదని విమర్శించారు.
ప్రజా సమస్యలపై సోషల్ మీడియాలో స్టేటస్ పెట్టినా కేసులు పెడుతున్నారని, ఎన్నికల్లో పోటీ చేయొద్దని బెదిరింపులు వస్తున్నాయని ఇలాంటి బెదిరి హుజూర్నగర్ ప్రజలు విజ్ఞులని అన్ని ఆలోచిస్తూ ఉంటారని అన్నారు సమయం వచ్చినప్పుడు అన్ని లెక్కలు సరి చేస్తారని అన్నారు..
స్థానికంగా ఒకటి రెండు గ్రామాల్లో యువత సర్పంచు పోటీ చేస్తుంటే దానిపై కూడా కేసులు పెడుతూ తీవ్ర ఇబ్బందులు పాలు చేస్తున్నారని అన్నారు.. ఎన్ఆర్ఐ యువకుడు నరేందర్‌ను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు..
తన ఎమ్మెల్యే హయాంలో ఆర్డీవో కార్యాలయం, ఈఎస్ఐ ఆస్పత్రి, తీసుకొచ్చినట్లుగా గుర్తు చేశారు.. గతంలో పెండింగ్‌లో ఉన్న రింగ్‌రోడ్లు అన్నిటిని కూడా పూర్తి చేశామని అన్నారు..
గ్రామాల్లో సిమెంట్ రోడ్లు నిర్మించామని, ప్రస్తుతం అభివృద్ధి పనులు నిలిచిపోయాయని అన్నారు..
ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరుగుతున్నాయని, అన్నారు అంతేకాకుండా కార్మికులకు పూర్తి వేతనం అందడం లేదని ఆరోపించారు.
హుజూర్నగర్ నియోజకవర్గంలో మట్టి అక్రమ రవాణాతో కొండలు, గుట్టలు కనుమరుగైపోతున్నాయని విమర్శించారు..
యువత అభివృద్ధి, మహిళల సాధికారత, హుజూర్నగర్ అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చానని మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తెలిపారు.. ఈ కార్యక్రమంలో బిజెపి శ్రేణులు పాల్గొన్నారు.