అసలు గోదావరిలో మిగులు జలాలు లేవని కేంద్రం స్పష్టం చేసింది… హరీష్ రావు

అసలు గోదావరిలో మిగులు జలాలు లేవని కేంద్రం స్పష్టం చేసింది..

మిగులు జలాల మీద డీపీఆర్ ఆమోదం తెలపడం సాధ్యం కాదు..

అన్ని ప్రయత్నాలు విఫలం కావడంతో గోదావరి కావేరీ నదుల అనుసంధానం అని చంద్రబాబు కొత్త కుట్రకు తెర లేపాడు..

బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సమ్మక్క సారక్క ప్రాజెక్టు నుండి నదుల అనుసంధానం మొదలు అవ్వాలని ప్రతిపాదించాము..

కానీ ఇప్పుడు చంద్రబాబు కుట్ర వల్ల అసలు తెలంగాణ భూభాగానికి సంబంధం లేకుండానే నదుల అనుసంధానం జరుగుతుంది..

ఇంత జరుగుతుంటే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మౌనంగా ఉంటున్నారు.– హరీష్ రావు..

ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకున్నాయి

తెలంగాణకు అన్యాయం జరగకుండా సమ్మక్క సారక్క నుండి నాగార్జున సాగర్ నుండి సోమశిల తరలించి అక్కడినుండి కావేరీ నదికి అనుసంధానం చేసేలా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించింది

కానీ ఈరోజు అసలు తెలంగాణకు సంబంధం లేకుండా పోలవరం నుండి నల్లమల సాగర్ నుండి కావేరీ నదికి అనుసంధానం చేయాలని చంద్రబాబు ప్రతిపాదిస్తే కేంద్రం ఆమోదం తెలుపుతుంది

ఇంత కుట్ర జరుగుతుంటే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు చూస్తూ మౌనంగా ఉండడం వెనుక అర్ధం ఏమిటి?..ఏపీ ప్రభుత్వం తమకు ఆదర్శం అని చెప్పే KL Rao కూడా నదుల అనుసంధానం తెలంగాణ నుండి చేయాలని చెప్పాడు

ఏపీ బీజేపీ ఎంపీలు కేంద్రాన్ని కీలు బొమ్మ లాగా ఆడిస్తుంటే తెలంగాణ బీజేపీ ఎంపీలు మౌనంగా చూస్తున్నారు అని అన్నారు.