నల్లగొండ జిల్లా.. పోరాటాల ఖిల్లా.. -గతంలో తాను పెండింగ్ ప్రాజెక్టుల క్షేత్రస్థాయి పరిశీలన చేసిన తర్వాతే.. R&R ప్యాకేజీ ఇస్తున్నారు… కవిత

నల్లగొండ జిల్లా కేంద్రంలో.. రైతు సమస్యలపై తెలంగాణ రక్షక సేన-TRS చీఫ్ “కల్వకుంట్ల కవిత” ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం.

కవిత మాట్లాడుతూ..
నల్లగొండ జిల్లా.. పోరాటాల ఖిల్లా..
-గతంలో తాను పెండింగ్ ప్రాజెక్టుల క్షేత్రస్థాయి పరిశీలన చేసిన తర్వాతే.. R&R ప్యాకేజీ ఇస్తున్నారు..
రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. క్లాక్ టవర్ సర్కిల్‌లో మలి దశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంత్ చారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆమె, అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపారు. మనోరమ హోటల్‌లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో రైతుల సమస్యలపై గళమెత్తారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై ఘాటు విమర్శలు చేశారు.”అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు వ్యవసాయ శాఖపై ఒక్క సమీక్షా చేయని సీఎం, రైతులను ఎలా ఆదుకుంటారు?” అని ప్రశ్నించారు. రైతు భరోసా, రుణమాఫీ వంటి పథకాలను ఎగ్గొట్టి అన్నదాతలను అరిగోస పెడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల ఏడాదిలో రాజకీయ లబ్ధి కోసం మాత్రమే రైతు భరోసా సాయం చేసే సంకుచిత ధోరణిని రైతులు గమనించాలని సూచించారు..

“పంచ జన్యం” పేరుతో.. జనంలోకి వెళ్తున్నాం.రైతుకి పెట్టుబడి సాయం.. అందని ద్రాక్షే.పేద రైతులు పుస్తేలతాడు బ్యాంకులో కుదువపెట్టుకోకుండా CM రేవంత్ రెడ్డి పెట్టుబడి సాయం మంజూరు చేయాలి.ధాన్యం రైతుల దోపిడి ప్రభుత్వానికి కనపడటం లేదా..?..క్వింటా ధాన్యానికి 5 నుంచి 10 కేజీల కటింగ్ చేశారు. లారీల కిరాయి రైతులే చెల్లించారు.-వ్యవసాయ శాఖ మీద CM రేవంత్ రెడ్డి రివ్యూ చేయలేదు.mptc, zptc ఎన్నికలు వస్తేనే రైతు భరోసా ఇస్తారేమో.సెక్రటేరియట్ ముందు ధాన్యం పోసి ధర్నా చేస్తేనే ప్రభుత్వం దిగి వచ్చింది.-మా TRS శ్రేణులు రైతు సమస్యలపై పోరాటం చేయాలి.పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు రివ్యూలో.. నల్లగొండ లోని డిండి ప్రాజెక్టు మీద మాట్లాడలేదు.

ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు సప్పుడు లేదు..?.ఎదుల్ల నుండి వాటర్ సోర్స్ పాయింట్ మీద మంత్రి ఉత్తమ్ దృష్టి పెట్టాలి.కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ప్రకటించిన రైతు డిక్లరేషన్ గాలికి వదిలేసింది.జిల్లాకు చెందిన ఓ మంత్రి 200 ఎకరాల అసైన్డ్ భూములు కొన్నట్లు సమాచారం.రైతు డిస్కం” పేరుతో.. ఉచిత కరెంట్ కు మంగళం పాడాలని ప్రభుత్వం ప్లాన్ అని ఆరోపించారు..