స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మెమరీ చిప్‌ల కొరత ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ధరలు పెంచకుండా వచ్చిన యాపిల్ iPhone కంపెనీ ఇక చేతులెత్తేసేలా కనిపిస్తోంది. ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ తాజా ఇంటర్వ్యూలో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ మాట్లాడుతూ.. సరఫరాదారులు పెంచుతున్న భారీ ఖర్చులను కంపెనీ ఇకపై పూర్తిగా భరించలేదని, రాబోయే రోజుల్లో ఐఫోన్ల ధరల పెరుగుదల అనివార్యమని స్పష్టం చేశారు. పరిస్థితి కష్టంగా మారిందని, కస్టమర్ల ప్రయోజనాల కోసం విడిభాగాల ధరలు త్వరలోనే అదుపులోకి రావాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. మార్కెట్లో షావోమి, వన్‌ప్లస్, ఒప్పో వంటి బ్రాండ్లు ఇప్పటికే తమ ఫోన్ల ధరలను పెంచేసినప్పటికీ యాపిల్ మాత్రం ధరలను మార్చలేదు. కానీ మారుతున్న పరిస్థితుల రీత్యా రాబోయే ‘ఐఫోన్ 18’iPhone లైనప్‌తో పాటు ఈ ఏడాది రానున్న సరికొత్త ‘ఫోల్డబుల్ ఐఫోన్’ ధరలపై ఈ భారం గట్టిగా పడే అవకాశం ఉందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ఫోన్ల ధరలు అమాంతం పెరగడానికి అసలు కారణం ప్రస్తుతం నడుస్తున్న ‘ఏఐ విప్లవమే’. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వర్లు, భారీ డేటా సెంటర్ల డిమాండ్ విపరీతంగా పెరగడంతో.. వాటికి అవసరమయ్యే డీరామ్, హై-బ్యాండ్‌విడ్త్ మెమరీ (హెచ్‌బీఎం) చిప్‌ల కొరత ఏర్పడింది. చిప్స్ తయారు చేసే కంపెనీలన్నీ లాభాల కోసం ఏఐ ప్రాజెక్టులకే ప్రాధాన్యత ఇస్తుండటంతో, స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తక్కువగా ఉన్న విడిభాగాల కోసం ఎక్కువ ధర చెల్లించి పోటీ పడాల్సి వస్తోంది. ఈ సమస్య కేవలం మొబైల్ రంగంలోనే కాదు, త్వరలో ఆటోమొబైల్, ఇతర ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల ధరలనూ పెంచే ప్రమాదం ఉందని పరిశ్రమల బృందాలు హెచ్చరిస్తున్నాయి. యాపిల్ సొంతంగా మెమరీ చిప్ తయారీ ప్లాంట్లు పెట్టే ఆలోచన లేదని స్పష్టం చేసిన టిమ్ కుక్, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సరఫరాను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.