ప్రస్తుతం హడావుడి జీవితంతో ప్రతి ఒక్కరూ కూడా జీవితాన్ని ఒత్తిడికి లోన్ చేసుకోవడం జరుగుతుంది.. కానీ ఎటువంటి టాబ్లెట్ కూడా మానసిక రోగాన్ని తగ్గించలేదు కానీ అన్నిటికంటే ఎక్కువగా యోగా మాత్రం మానసిక ఒత్తిడిని తగ్గించగలుగుతుందని చెప్పడానికి చాలా రుజువులు కూడా ఉన్నాయి.. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ కూడా యోగాని అలవాటుగా మార్చుకోవడం జరుగుతుంది.. అందులో భాగంగానే నేడు యోగ డే కావడంతో యోగా గురువులు తమకున్న యోగ పై శ్రద్ధను విద్యార్థులందరికీ కూడా వివరించడం జరుగుతుంది.. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లాలో ZPHS మరియు MPPS కొత్తగూడెం హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు మరియు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి కృష్ణకుమారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో యోగాచార్యులు షేక్ బహార్ అలీ విద్యార్థిని విద్యార్థులకు యోగాసనాలు ప్రాణయామము ధ్యానము ప్రోటోకాల్ ద్వారా చేయించడం జరిగింది. పిల్లలు శారీరక మానసిక ఆరోగ్యం కొరకు ఏకాగ్రత కొరకు జ్ఞాపకశక్తి కొరకు చక్కని ఆసనాలు చేయించడం జరిగినది ఈ కార్యక్రమంలో టీచర్ నాగేశ్వరరావు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, సహా ఉద్యోగులు పాల్గొనడం జరిగింది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.