ట్రంప్, ఇరాన్ విరుద్ధ ప్రకటనలు..ఇంకా అనిశ్చితిలోనే పశ్చిమాసియా.!

అమెరికా-ఇరాన్‌ మధ్య యుద్ధం ముగింపునకు సంతకాలు జరిగినప్పటికీ.. హర్మూజ్‌ నిర్వహణ, అణు కేంద్రాల పరిశీలన వంటి అంశాల్లో రెండు దేశాల మధ్య భేదాభిప్రాయాలు నెలకొన్నాయి. బాంబు దాడుల్లో దెబ్బతిన్న అణు కేంద్రాల్లో తనిఖీల కోసం అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (ఐఏఈఏ) ఇన్‌స్పెక్టర్లను అనుమతించేందుకు ఇరాన్‌ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. ఆయన ప్రకటనను ఇరాన్‌ ఖండించింది. మరోవైపు, హర్మూజ్‌ను మూసేశామని టెహ్రాన్‌ చెబుతుండగా.. అది తెరిచే ఉందని అమెరికా అంటోంది. ఈ గందరగోళం నడుమ పశ్చిమాసియాలో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.