వెనెజువెలా రెండు తీవ్రమైన భూకంపం..!

తాజాగా వెనెజువెలా రెండు తీవ్రమైన భూకంపాలతో తీవ్రంగా కంపించింది. రాజధాని ప్రాంతంలో బహుళ అంతస్తుల భవనాలు కూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకున్న ప్రజలు ఉండే అవకాశం ఉందని, దీంతో ప్రాణనష్టం భారీగా జరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తీవ్ర విధ్వంసం..
రెండు భారీ భూకంపాలు వచ్చిన తర్వాత రాజధాని ప్రాంతంలో ఎక్కువగా బహుళ అంతస్తుల భవనాలు కూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకున్న వ్యక్తులు ఉండే అవకాశం ఉందని స్థానిక అధికారులు, ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఈ భూకంపాల ధాటికి రోడ్లు, వంతెనలు కూడా దెబ్బతిన్నట్లు సమాచారం. గాయపడిన వారి సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ప్రస్తుతం ప్రభుత్వం మతుల సంఖ్యను అధికారికంగా వెల్లడించలేదు.

భారీగా ప్రాణ నష్టం..
అమెరికా జియోలాజికల్‌ సర్వే (యూఎస్‌జీఎస్‌) ప్రకారం ఈ భూకంపాల తర్వాత బలమైన ప్రకంపనలు రావచ్చు. దీంతో విధ్వంసం మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంది. మతుల సంఖ్య 10 వేల నుంచి లక్ష వరకు ఉండవచ్చని అంచనా వేశారు. శాస్త్రవేత్తలు ఈ విపత్తు విధ్వంసకరంగా ఉండొచ్చని, భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు.

ప్రభుత్వం జాగ్రత్త చర్యలు..
ప్రభుత్వం ప్రభావిత ప్రాంతాల ప్రజలను నివాసాలను విడిచి బయటకు రావాలని సూచించింది. అదనపు ప్రమాదాలను నివారించేందుకు ఇళ్లకు ఇంధన సరఫరాను నిలిపివేసింది. కొన్ని భవనాలు కూలిన నేపథ్యంలో మరింత నష్టం, మంటలు జరగకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. రక్షణ బృందాలు శిథిలాల నుంచి వ్యక్తులను బయటకు తీసే పనిలో నిమగ్నమయ్యాయి.

సెలవు కావడంతో ఇళ్లలోనే..
జూన్‌ 24న జాతీయ సెలవుదినం కావడంతో చాలామంది ఇళ్లలోనే ఉన్నారు. నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో మొదటి భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయంతో బయటకు పరుగెత్తిన దృశ్యాలు కనిపించాయి. సాధారణ రోజులతో పోలిస్తే సెలవుదినం కారణంగా ఇళ్లలో ఎక్కువ మంది ఉండటం వల్ల ప్రాణనష్టం మరింతగా ఉండే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెజ్‌ కూడా ఈ విపత్తులో భారీ మరణాలు జరిగే అవకాశం ఉందని తన సందేశంలో పేర్కొన్నారు.

వరుసగా 20 ప్రకంపనలు..
రెండు వరుస ప్రకంపనల తర్వాత అత్యవసర పరిస్థితి ప్రకటించింది ప్రభుత్వం. తర్వాత సుమారు 20 ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ ప్రకటనతో రక్షణ బృందాలు, వైద్య సేవలు త్వరితగతిన అందుబాటులోకి వచ్చాయి. ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించే పనులు వేగంగా జరుగుతున్నాయి. మెక్వెషియా అంతర్జాతీయ విమానాశ్రయం భూకంపం ధాటికి దెబ్బతిన్నందున దానిని మూసివేశారు. దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేశారు. రాజధాని మరియు ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలు, విద్యా సంస్థలు కూడా మూసివేశారు.

మొత్తంగా భారీ భూకంపం వెనెజువెలాను అతలాకుతలం చేసింది. లక్ష మందికిపైగా మరణించడం పెను వినాశనమే అని నిపుణులు భావిస్తున్నారు.

కార‌కాస్: వెనిజువెలా దేశ చ‌రిత్ర‌లోనే అత్యంత భీక‌ర‌మైన భూకంపాలు ఇవాళ న‌మోదు అయ్యాయి. స్థానిక కాల‌మానం ప్ర‌కారం బుధ‌వారం సాయంత్రం ఆరు గంట‌ల త‌ర్వాత దేశ రాజ‌ధాని కార‌కాస్‌కు స‌మీపంలో రెండు భూ కంపాలు సంభ‌వించాయి. మొద‌టి భూకంపం రిక్ట‌ర్ స్కేల్‌పై 7.2గా న‌మోదు అయ్యింది. యార‌కూ రాష్ట్రంలోని శాన్ ఫిలిపే కేంద్రంగా ఆ భూకంపం వ‌చ్చింది. మ‌రో 32 సెక‌న్ల తేడాలోనే మ‌ళ్లీ భారీ భూకంపం న‌మోదు అయ్యింది. రెండోసారి 7.5 తీవ్ర‌తో వెనిజువెలాను భూకంపం కుదిపేసింది. భూకంప కేంద్రానికి స‌మీపంలో ఉన్న ప‌లు రాష్ట్రాల్లో తీవ్ర న‌ష్టం జ‌రిగింది. భూకం ధాటికి అనేక బిల్డింగ్‌లు కూలాయి. శిథిలాల కింద వేల సంఖ్య‌లో జ‌నం చిక్కుకుని ఉంటార‌ని భావిస్తున్నారు. వెనిజువెలాలో బుధ‌వారం ప‌బ్లిక్ హాలీడే. దీంతో ఎక్కువ శాతం మంది ఇండ్ల‌ల్లో లేదా ప‌బ్లిక్ స్థ‌లాల్లో ఉండే అవ‌కాశాలు ఉన్నాయి. దీని వ‌ల్ల ప్రాణ న‌ష్టం భారీగా పెరిగే అవ‌కాశాలు ఉన్న‌ట్లు అంచ‌నా వేశారు..