దేశంలోని 8 రాష్ట్రాల్లో పెట్రోల్ బంకులు ఆదివారం బంద్ అవుతాయ్..!..

పెట్రోల్ బంకుల మూత..!

ఆఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ప్రధాని మోదీ పిలుపు మేరకు దేశంలోని 8 రాష్ట్రాల్లో పెట్రోల్ బంకులు ఆదివారం బంద్ అవుతాయ్..!..

సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన ఈ వార్త మీదాకా కూడా వచ్చే ఉంటుంది. ఇదంతా ఫేక్, నాట్ అఫీషియల్ అని తర్వాత తెలిసిందనుకోండి. కానీ, ఆదివారం ఒక్కరోజు కాదు, వారంలో ఒక్కరోజుకు మించి పెట్రోల్‌బంకులు పనిచేయలేని రోజులు మున్ముందు రాబోతున్నాయ్. ఇప్పటికే దేశంలో వేలకొద్దీ పెట్రోల్ పంపులు మల్టీపర్పస్ కౌంటర్లుగా మారిపోయాయి.

కొన్ని బంకులైతే ఈవీ చార్జింగ్ స్టేషన్లు, సిగరెట్ షాపులుగా కూడా షేపులు మార్చుకున్నాయి. ఎస్.. ఆయిల్‌కు ఆల్టర్నేటివ్స్ పెరిగి, దేశ రవాణా రంగమంతా పక్కచూపులు చూస్తోంది. షోరూమ్‌లో టూవీలరో, ఫోర్ వీలరో కొనడానికి వెళ్లినప్పుడు మొదటగా ఏం అడుగుతాం?

ధర ఎంతౌతుంది అనికాదు, ఈ బండి ఎంతిస్తుంది అని. ఎందుకంటే, మైలేజ్ మీదే మనోళ్లకు కాన్‌సన్‌ట్రేషన్ ఎక్కువ కాబట్టి. ఇప్పుడైతే అదికూడా మారిపోయింది. పెట్రోల్ బండి కొనాలా, ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలా, హైడ్రోజన్ బండి కొనడమా..

ఏదైతే బెటర్ మైలేజ్ ఇస్తుంది? ఏదైతే జర్నీ సాఫీగా ఔతుంది అని లోతుగా ఎంక్వైరీ చేసిన తర్వాతే షోరూమ్‌కి వెళ్తున్నాడు సగటు కస్టమర్. పైగా, జనంలో ఎకో ఫ్రెండ్లీ అవేర్‌నెస్ కూడా బాగా పెరిగి, చమురును కాలుష్యకారకంగా చూస్తూ, దానికి దూరంగా జరగడం మొదలైంది. సో, ఫ్యూయల్ కన్జంప్షన్‌లో ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. పెట్రోల్-డీజిల్‌కి ఒకటికి నాలుగు…