బీఆర్ఎస్ రాక్షస పాలన సాగింది …సీఎం రేవంత్.

రేవంత్ రెడ్డి ఖమ్మం సభలో జర్నలిస్టుల నిరసన..

2023 ఎన్నికల ముందు హమీ ఇచ్చినట్టు జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని నిరసన తెలిపిన జర్నలిస్టులు.

ఖమ్మం “రైతు ఆశీర్వాద సభ”లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి….

రాజకీయంగా పాలమూరు నాకు ప్రాణమైతే.. ఖమ్మం జిల్లా గుండెకాయ లాంటిది..

2023 జూలై లో పొంగులేటి చేరిక సందర్భంగా ఖమ్మం జిల్లా ప్రజలు ఉప్పెనలా వచ్చి బీఆరెస్ ను బొంద పెట్టారు.

సరిగ్గా ఇప్పుడు అదే జూలై లో బీఆరెస్ ను మళ్లీ మొలకెత్తనివ్వమని చింతకాని సభకు వేలాదిగా తరలి వచ్చిన మీకు అభినందనలు

2023 లో ప్రభుత్వ ఏర్పాటు నుంచి ప్రతీ ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వాన్ని గెలిపించి… పాపాల భైరవున్ని ఫామ్ హౌస్ లోనే బందీ చేశారు

జరగబోయే కురుక్షేత్రంలో కౌరవ కల్వకుంట్ల కుటుంబాన్ని రాజకీయ ముఖచిత్రం నుంచి పాతాళానికి తొక్కే వరకు కాంగ్రెస్ కార్యకర్తలు విశ్రమించరు..

వచ్చే సాధారణ ఎన్నికలు 2028 డిసెంబరులో జరగవు..

2029 మే లేదా జూన్ మాసంలో జరుగుతాయి..

తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలు 26 కు పెరుగుతాయి.

119 అసెంబ్లీ స్థానాలు 182 కు పెరుగుతాయి.

36 నెలల ముందుగానే వచ్చే ఎన్నికల ఫలితాల జోస్యం చెబుతున్నా..

182 అసెంబ్లీ స్థానాల్లో 117 సీట్లు గెలిచి రెండోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది..

భద్రాచలం రాములవారి మీద ఆన… ఇది ఖమ్మం కాంగ్రెస్ కార్యకర్తల మాట

రాస్కో చంద్ర శేఖర్ రావు… నీ దొంగ సర్వేలు చేసే దొంగ ఏజెన్సీలు గుర్తు పెట్టుకోండి..

ఈ మాట కోసం రోజుకు 18 గంటలు పనిచేస్తాం..

ప్రతీ సందర్భంలో ప్రజా ప్రభుత్వం రైతులను ఆదుకుంటోంది

ఒకరిపై ఒకరికి నమ్మకం లేదు.. ఒకే ఇంట్లో రెండు గుంపులు

ఒకరిపై ఒకరు పోటీగా ఒకాయన కన్నెపల్లికి పోయి పంపులు ఆన్ చేయాలంటాడు

ఒకసారి మేడిగడ్డ కుంగితేనే ఇంత నష్టం జరిగింది… మళ్లీ నీళ్లు నింపితే భద్రాచలం రాముడు మునుగుతాడు

ఖమ్మం జిల్లాలో 44 ఊర్లు కొట్టుకుపోయాయి దుర్మార్గుడా…

నీ దుష్ట రాజకీయాల కోసం మేడిగడ్డ నింపాలా అని అడిగితే సమాధానం లేదు

రేవంత్ రెడ్డి సర్వేలో కాంగ్రెస్ ఓడిపోతుందని దుష్ప్రచారానికి దిగారు

ఎన్నికలు ఎప్పుడో తెలియకుండా, రిజర్వేషన్లు ఎలా మారుతాయో తెలియకుండా ఎవరైనా సర్వేలు చేస్తారా.. గెలుపు ఓటములు నిర్ణయిస్తారా?

జూబ్లీహిల్స్ లో ఇలాగే చెబితే జనం బీఆరెస్ ను బండకేసి కొట్టారు

బ్యాడుమేళం బ్యాచ్ లా బీఆరెస్ సర్వేల బ్యాచ్ తయారైంది

బీజేపీ లోకి వెళ్ళనని హరీష్ రావును కెసీఆర్ పై ఒట్టేసి చెప్పమను

నువ్వు ఎక్కడుంటావో తెలియదు.. మీ బావ ఎటు పోతాడో తెలియదు

బీఆరెస్ ను బీజేపీ లో విలీనం చేస్తారని నీ సొంత చెల్లెలే చెబుతోంది

ఆంధ్ర కాంట్రాక్టర్లు బీఆరెస్ కి వందల కోట్లు ఇచ్చారని నీ సొంత చెల్లే చెప్పింది

బీఆరెస్ అమలు చేసిన షాది ముబారక్, రైతు బందు పథకాలను మేం కొనసాగించడం లేదా?

ప్రతీ పేదవాడికి రేషన్ కార్డు, సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చాం

రైతు భరోసా 12 వేలకు పెంచాం, రైతు రుణమాఫీ చేసి రుణవిముక్తులను చేశాం

రాబోయే ఎన్నికల్లో తెలంగాణ నుంచి 26 పార్లమెంట్ స్థానాలకు 20 పార్లమెంట్ స్థానాలు గెలిపిద్దాం

రాహుల్ గాంధీని ప్రధాని చేసుకుందాం

భట్టి కోరికమేరకు మధిరకు ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరు చేస్తాం..

రైతు భరోసా తుది విడత నిధులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఖమ్మంలో జరిగిన రైతు ఆశీర్వాద సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. అన్నదాతల నిధులు విడుదల చేసేందుకు బటన్ నొక్కారు. అనంతరం భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణలో పదేళ్లపాటు బీఆర్ఎస్ రాక్షస పాలన సాగిందని సీఎం రేవంత్ అన్నారు. వారి పాలనలో రైతులకు బేడీలు వేశారని మండిపడ్డారు. దీంతో ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అనేది లేకుండా ప్రజలు చేశారని ఆయన చెప్పుకొచ్చారు..

రేవంత్ రెడ్డి ఖమ్మం సభలో జర్నలిస్టుల నిరసన..

2023 ఎన్నికల ముందు హమీ ఇచ్చినట్టు జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని నిరసన తెలిపిన జర్నలిస్టులు.. జర్నలిస్టులందరికీ ఇల్లు ఇస్తానని గతంలో ఇచ్చిన హామీ మేరకు అందరికీ ఇంటి స్థలాలు కేటాయించి అందులో గృహాలు నిర్మించాలని జర్నలిస్టులు ప్లే కార్డ్స్ ప్రదర్శించారు..సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఖమ్మం జిల్లాలో 2023లో ఓ అద్భుతం జరిగింది. బీఆర్ఎస్‌ను కాదని కాంగ్రెస్‌లోకి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చారు. దీంతో ఆనాడు కాంగ్రెస్‌లోకి ఉప్పెనలా జనం వచ్చారు. కారు పార్టీని ప్రజలు ఇక్కడ మళ్లీ మొలకెత్తనీయకుండా చేశారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ డబ్బు మూటలను కాంగ్రెస్ తట్టుకోలేదని కొందరు అన్నారు. అయితే, 65 సీట్లలో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని చెప్పి మరీ గెలిచి చూపించాం. పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ ఆ పార్టీకి గుండు సున్నా వచ్చేలా చేశాం. 2023 ప్రభుత్వ ఏర్పాటు నుంచి ఏ ఎన్నికలైనా కాంగ్రెస్‌దే గెలుపు..