కాంగ్రెస్ పార్టీతో ఏమన్న లోపాయకారి ఒప్పందం ఉందా? కవిత….మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి ..

బీఆర్‌ఎస్‌ పార్టీ ఖాతాలోకి డబ్బులు క్విడ్‌ ప్రోకో ద్వారా వచ్చాయని మాజీ ఎమ్మెల్సీ కవిత ఫ్రస్టేషన్‌లో ఏవోవో మాట్లాడుతుందని, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధంగా దేశంలోని అన్ని పార్టీలు పార్టీ ఫండ్స్‌ సేకరిస్తుంది అని అన్నారు.. బీఆర్‌ఎస్ పార్టీ చట్టబద్ధంగా పార్టీ ఫండ్‌ కలిగి ఉందని తెలిపారు. కానీ, ఆమెకు ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే కనపడుతుంది. కాంగ్రెస్ పార్టీ వల్ల ఎంతో మంది ఉద్యమకారులు అమరులు అయ్యారు…కాంగ్రెస్ పార్టీని ఎందుకు డబ్బులు ఇవ్వమని అడగరు? కాంగ్రెస్ పార్టీతో ఏమన్న లోపాయకారి ఒప్పందం ఉందా? జరిగిందా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ హయాంలో వందలాది మంది అమరవీరుల కుటుంబాలను ఆదుకుందని తెలిపారు. ఇదే కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇవ్వకపోవడం వల్లే బలిదానాలు జరిగాయని, మరి కాంగ్రెస్‌ను ఎందుకు ప్రశ్నించవని సూటిగా నిలదీశారు. టీవీలో కనపడాలని ఏదేదో మాట్లాడుతుందని ఆమె మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.. BRS లో ఆమె మాటలను ఎవ్వరు పాటించుకోరు అన్నారు.