యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి వద్ద.. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి పక్కనే ఉన్న లారీ పార్కింగ్లో దొంగలు బీభత్సం సృష్టించారు..
బ్యాటరీ దొంగలు పోలీసులకే సవాల్ విసురుతున్నారు..
రాత్రి సమయంలో పార్కింగ్ చేసిన మూడు లారీల బ్యాటరీలను దొంగలు ఎత్తుకెళ్లారు.. వీటి విలువ సుమారు 60 వేల రూపాయలు ఉంటుందని డ్రైవర్లు తెలిపారు….
గత కొన్ని నెలల్లోనే మూడు సార్లు లారీలు, ట్రాక్టర్ల బ్యాటరీలు చోరీకి గురయ్యాయని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..
రాత్రిపూట పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించడం లేదని.. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని డ్రైవర్లు వాపోతున్నారు..
పంతంగి లారీ పార్కింగ్లో వరుస బ్యాటరీ చోరీలపై పోలీసులు వెంటనే స్పందించి.. రాత్రిపూట పెట్రోలింగ్ నిర్వహించాలని డ్రైవర్లు కోరుతున్నారు..