సూర్యాపేట జిల్లా.
కోదాడ నియోజకవర్గం నడిగూడెం విద్యుత్ సబ్స్టేషన్ వద్ద రైతులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు..
నడిగూడెం విద్యుత్ సబ్స్టేషన్ను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి రైతులకు విద్యుత్ సరఫరాపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు నాణ్యమైన విద్యుత్, సాగునీరు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.ఎల్నినో ప్రభావంపై ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బోర్లకు సరిపడా విద్యుత్ లేక పంటలు ఎండిపోతున్నాయని అన్నారు. ప్రభుత్వం వెంటనే కాళేశ్వరం–కన్నెపల్లి నుంచి సాగునీటిని విడుదల చేసి, రైతులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు.రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నడిగూడెం విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు.