SIR కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యలు కావాలి.. బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి .
–
చింతపల్లి………
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనలని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి అన్నారు.అర్హత కలిగిన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడడంతో పాటు,ఓటర్ల వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే వాటిని సరిచేసుకోవాలని సూచించారు.
SIR ప్రక్రియలో భాగంగా అధికారులు,బూత్ స్థాయి సిబ్బంది ఇంటింటికీ వచ్చి ఓటర్ల వివరాలను పరిశీలిస్తున్న నేపథ్యంలో ప్రజలు వారికి సహకరించాలని ఆయన కోరారు.ప్రతి కుటుంబం తమ ఓటరు వివరాలను పరిశీలించుకుని అవసరమైన పత్రాలు మరియు వివరాలను సక్రమంగా అందజేయాలని తెలిపారు.అర్హులైన ఒక్క ఓటరు కూడా ఓటరు జాబితా నుంచి తప్పిపోకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని ప్రతి అర్హత కలిగిన పౌరుడు తన ఓటు హక్కును కాపాడుకోవాలని ఆయన అన్నారు.