తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల భర్తీ…. 7,437 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల…

తెలంగాణలో పోలీస్ కొలువుల జాతర.. 7,437 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్: తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పోలీస్ నియామక మండలి పోలీస్ శాఖలో మొత్తం 7,437 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్), తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్‌పీ), ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖ తదితర విభాగాల్లో ఈ నియామకాలు చేపట్టనున్నారు.
దరఖాస్తుల స్వీకరణ పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు నియామక మండలి వెల్లడించింది. దరఖాస్తుల ప్రారంభ, ముగింపు తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపింది. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం tgprb.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.
ఎస్‌ఐ పోస్టుల వివరాలు:
ఎస్‌ఐ (సివిల్) – 148
ఎస్‌ఐ (ఏఆర్) – 14
టీజీఎస్‌పీ ఎస్‌ఐ – 12
ఎస్‌ఏఆర్‌సీపీఎల్ ఎస్‌ఐ – 3
ఎస్‌ఐ (ఫింగర్ ప్రింట్ బ్యూరో) – 23
కానిస్టేబుల్ పోస్టుల వివరాలు:
కానిస్టేబుల్ (సివిల్) – 3,697
కానిస్టేబుల్ (ఏఆర్) – 1,052
పీటీవో కానిస్టేబుల్ – 20
కానిస్టేబుల్ (మెకానిక్) – 7
స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ – 44
ఇతర కానిస్టేబుల్ పోస్టులు – 1,038
అలాగే ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖలోని ఇతర పోస్టుల వివరాలను కూడా నియామక మండలి విడతలవారీగా వెల్లడించనుంది. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు నోటిఫికేషన్‌ను పూర్తిగా పరిశీలించి, దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన వెంటనే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.