పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి.. కారణం ఇదే అంటు సోషల్ మీడియాలో వైరల్..!

నర్సంపేట నియోజకవర్గంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గత కొన్ని రోజులుగా అత్యాధునిక వైద్యం అందించినప్పటికీ వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. ఆయన అస్వస్థతకు గల కారణాలపై ప్రస్తుతం పలు చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో కాలికి తగిలిన గాయం వల్ల నరాల్లో రక్తం గడ్డ ‘డీప్ వెయిన్ థ్రాంబోసిస్’ ఏర్పడి, అది ఊపిరితిత్తులకు చేరి పల్మనరీ ఎంబాలిజానికి దారితీసిందా తద్వారా గుండెపై తీవ్ర ప్రభావం పడిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇటువంటి పరిస్థితి కొన్నిసార్లు ప్రాణాపాయానికి దారి తీయవచ్చని చెబుతున్నారు.

పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాదం
https://x.com/BRSparty/status/2083079830413947116?s=20నర్సంపేట నియోజకవర్గంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి తీవ్ర విషాదాన్ని నింపింది. గత కొన్ని రోజులుగా ఆయనకు అత్యాధునిక వైద్యం అందించినప్పటికీ వైద్యుల ప్రయత్నాలు ఫలించకపోవడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో పార్టీ శ్రేణులు, అభిమానులు, స్థానిక ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

ఇదిలా ఉండగా, ఆయన అస్వస్థతకు గల కారణాలపై పలు చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో కాలికి తగిలిన గాయం కారణంగా నరాల్లో రక్తం గడ్డకట్టే ‘డీప్ వెయిన్ థ్రాంబోసిస్ (DVT)’ ఏర్పడి, ఆ గడ్డ ఊపిరితిత్తులకు చేరి ‘పల్మనరీ ఎంబాలిజం’కు దారితీసి, దాని ప్రభావం గుండెపై పడిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే, ఈ అంశంపై అధికారిక వైద్య బులెటిన్ లేదా కుటుంబ సభ్యుల నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం డీప్ వెయిన్ థ్రాంబోసిస్ కారణంగా రక్తం గడ్డ ఊపిరితిత్తులకు చేరితే పల్మనరీ ఎంబాలిజం ఏర్పడి, కొన్ని సందర్భాల్లో అది ప్రాణాపాయ పరిస్థితులకు దారి తీసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. కాగా, ఆయన మరణానికి గల ఖచ్చితమైన కారణంపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.