గిరిజన హక్కుల పరిరక్షణే ధ్యేయంగా ఈ నెల 8న మన్యం బంద్ (Manyam Bandh) పాటించాల్సిందిగా ఆదివాసీ సంఘాలు పిలుపునిచ్చాయి. గిరిజన ప్రాంతాల్లో తమ దీర్ఘకాలిక డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశాయి.ఏజెన్సీ ప్రాంతాల్లోని ఉద్యోగ నియామకాల్లో ఆదివాసీలకు 100 శాతం రిజర్వేషన్లు కల్పించేలా గతంలో ఉన్న జీవో నంబర్ 3 (GO No.03)ను వెంటనే పునరుద్ధరించాలని ఆదివాసీ సంఘాలు కోరాయి. ఇక 50 శాతానికి పైగా గిరిజన జనాభా కలిగిన గ్రామాలను వెంటనే రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్డ్ పరిధిలోకి అంటే ఏజెన్సీ ప్రాంతాలుగా చేర్చాలని స్పష్టం చేశాయి. అదేవిధంగా ఆగస్టు 9న జరగనున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం (World Tribal Day) నాటికి సీఎం చంద్రబాబు ఆ రెండు ప్రధాన డిమాండ్లపై స్పష్టమైన ప్రకటన చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అయితే, ఆదివాసీ సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపుతో మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల పరిధిలో బంద్ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. వ్యాపార, వాణిజ్య, రవాణా సంస్థలు ఈ బంద్కు సహకరించాలని సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.