ప్రశాంత్ కిషోర్ బంకీపూర్ గెలుపొందారు.
బంకీపూర్ ఉప ఎన్నికలో జన్ సూరాజ్ చీఫ్ ప్రశాంత్ కిషోర్ 18,953 ఓట్లతో విజయం సాధించారు.
28 రౌండ్ల తర్వాత బంకిపూర్ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిషోర్ 19,419 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు.
జన్ సూరాజ్ యొక్క ప్రశాంత్ కిషోర్ మొదటి ఎన్నికల విజయాన్ని ముగించారు.
కిషోర్ యొక్క జన్ సూరాజ్ పార్టీ 1995 నుండి బిజెపికి ఉన్న సుదీర్ఘ పట్టును భంగపరచవచ్చు
బిహార్ ఉపఎన్నికలో బాంకీపూర్ స్థానం నుంచి ప్రశాంత్ కిషోర్ విజయం సాధించారు. ఆయన జనసురాజ్ పార్టీ ఎట్టకేలకు బోణీ కొట్టింది. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్పై ప్రశాంత్ కిషోర్ 18 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1995 నుంచి ఈ స్థానంలో బీజేపీ ఎప్పుడూ ఓడిపోలేదు. బిహార్ రాజకీయాల్లో కంచుకోటగా భావించే బాంకీపూర్ ఉపఎన్నిక ఫలితాలు బీజేపీకి గట్టి షాక్ ఇచ్చాయి. బీజేపీ ఊహించని ఓటమి చవిచూడడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. గతేడాది ఎన్నికల్లో ఏకంగా 50 వేలకు పైగా భారీ మెజారిటీతో గెలిచిన బీజేపీ, ఇప్పుడు ఈ స్థానాన్ని కోల్పోవడం పార్టీ వర్గాలను విస్మయానికి గురిచేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ప్రాతినిధ్యం వహించిన ఈ స్థానంలో కమల దళం పరాజయం పాలవడానికి గల అంతర్గత కారణాలపై పార్టీ అధిష్టానం లోతైన విశ్లేషణ మొదలుపెట్టింది. ఈ ఓటమిపై బీజేపీ నేతలు ప్రాథమిక అంచనాకు వచ్చారు.
RJD – పీకే (ప్రశాంత్ కిశోర్) లోపాయికారీ ఒప్పందం: ఆర్జేడీ తన కోర్ ఓట్లను ప్రశాంత్ కిశోర్ పార్టీకి బదిలీ చేయించిందని బీజేపీ అంచనా వేస్తోంది. బీజేపీకి పట్టున్న అగ్రవర్ణ ఓట్లలో చీలిక తెచ్చేందుకే ఆర్జేడీ ఈ వ్యూహం పన్నిందని భావిస్తోంది. తేజస్వీ యాదవ్ కేవలం ఒక గంట మాత్రమే ప్రచారం చేయడం వెనుక మర్మం ఇదేనని చెబుతోంది.
– అభ్యర్థి మార్పు ప్రభావం: మూడు దశాబ్దాలకు పైగా నితిన్ నబీన్ కుటుంబం ఈ నియోజకవర్గంలో గెలుపొందుతూ వస్తోంది. తండ్రి మరణం అనంతరం ఉప-ఎన్నికల్లో పోటీ చేసిన నితిన్ నబీన్, అప్పటి నుంచి వరుసగా గెలుపొందుతూ వచ్చారు. కానీ ఇప్పుడు ఆయన బీజేపీ జాతీయాధ్యక్షుడు కావడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, రాజ్యసభ ద్వారా పార్లమెంటులో అడుగుపెట్టారు. ఈ పరిస్థితుల్లో అక్కడ అభ్యర్థి మార్పు అనివార్యంగా మారింది. ఈ మార్పు ఓటర్లపై ప్రభావం చూపిందని పార్టీ నాయకత్వం భావిస్తోంది..