PM Narendra Modi: నరేంద్ర మోదీ తాజాగా ప్రధాని మోదీ తన దినచర్యపై కీలక విషయాలను వెల్లడించారు. తనకు కేవలం 8 సెకన్లలోనే నిద్ర పట్టేస్తుందని అన్నారు. తాను కేవలం 3 గంటలు మాత్రమే నిద్ర పోతానని స్పష్టం చేశారు. ఎన్డీయే నుంచి కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన ఎంపీలతో ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇక ఇదే సమావేశంలో ఫారిన్ టూర్స్ గురించి మాట్లాడుతూ.. తాను విమానం ఎక్కగానే వెళ్తున్న దేశం కాలమానానికి తగ్గట్టుగా వాచ్ లో సమయాన్ని సర్దుబాటు చేసుకుంటానని పేర్కొన్నారు. దాంతో తాను ఏ దేశానికి వెళ్లినా ఎటువంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. బుధవారం పార్లమెంట్ సమావేశాలకు ముందు అల్పాహారం సందర్భంగా కొత్త ఎంపీలతో ప్రధాని మోదీ దాదాపు గంటపాటు సమావేశం నిర్వహించారు. వీరిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ కూడా ఉన్నారు.