*భారత్లో ‘టాకింగ్ వెహికల్స్’ తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
*- 2028 అక్టోబర్ 1 నుంచి కొత్త వాహనాల్లో Vehicle-to-Vehicle (V2V) వ్యవస్థను తప్పనిసరి చేయాలని డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.*
*ఈ వ్యవస్థ ద్వారా వాహనాలు ఒకదానితో ఒకటి రియల్టైమ్ సమాచారాన్ని పంచుకుని, ప్రమాదాలు జరిగే ముందే డ్రైవర్లకు హెచ్చరికలు అందించే అవకాశం ఉంటుంది..
భారత్లోకి రానున్న ‘టాకింగ్ వెహికల్స్’.. ప్రమాదాల నివారణకు కేంద్రం కీలక ప్రతిపాదన
భారత్లో రోడ్డు భద్రతను మరింత మెరుగుపర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. దేశంలో ‘టాకింగ్ వెహికల్స్’ (Talking Vehicles) వ్యవస్థను తీసుకురావడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
ఈ మేరకు 2028 అక్టోబర్ 1 నుంచి తయారయ్యే కొత్త వాహనాల్లో Vehicle-to-Vehicle (V2V) కమ్యూనికేషన్ వ్యవస్థను తప్పనిసరి చేయాలని కేంద్రం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ సాంకేతికత ద్వారా వాహనాలు ఒకదానితో ఒకటి రియల్టైమ్లో సమాచారాన్ని పంచుకుంటాయి. దీంతో ముందున్న వాహనం అకస్మాత్తుగా బ్రేక్ వేయడం, ప్రమాదం జరగడం, రోడ్డు అడ్డంకులు లేదా ఇతర ప్రమాదకర పరిస్థితుల గురించి డ్రైవర్లకు ముందుగానే హెచ్చరికలు అందుతాయి. ఫలితంగా రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.