జగన్ను కలిసిన దేవరపల్లి హోటల్ నిర్వాహకురాలు వరలక్ష్మి..
టీడీపీ ఆరోపణలు పై ysrcp కౌంటర్..
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దేవరపల్లి హోటల్ నిర్వాహకురాలు వరలక్ష్మి గురువారం వైసీపీ కేంద్ర కార్యాలయంలో కలిసి తమకు జరిగిన పరిణామాలను వివరించారు.
దేవరపల్లిలో జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ కార్యకర్తలు తమ హోటల్ను ధ్వంసం చేశారని టీడీపీ నేత నారా లోకేష్, పార్టీ సోషల్ మీడియా వేదికల ద్వారా చేసిన ప్రచారాన్ని వరలక్ష్మి ఖండించారు. తమ హోటల్ ధ్వంసమైందన్న ప్రచారం పూర్తిగా అసత్యమని ఆమె స్పష్టం చేశారు.
అంతేకాకుండా, టీడీపీ నాయకులు తమను బెదిరించి “ఏదో జరిగిపోయిందని” చెప్పించారని జగన్కు వివరించినట్లు సమాచారం. వాస్తవానికి తమ హోటల్కు ఎలాంటి నష్టం జరగలేదని, జరిగిన ప్రచారం నిజం కాదని వరలక్ష్మి తెలిపారు.
ఈ సందర్భంగా దేవరపల్లి హోటల్ నిర్వాహకులు వైఎస్ జగన్ను కలిసి జరిగిన విషయాలపై పూర్తి వివరణ అందించినట్లు వైసీపీ వర్గాలు వెల్లడించాయి.