యాక్సిడెంట్ చేసి నా భర్తను చంపు, లేదంటే నేను చస్తా..
ప్రియుడికి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో పంపిన మెసేజెస్ చూసి షాకైన భర్త..
కొరియర్ బాయ్తో వివాహేతర సంబంధం పెట్టుకొని, భర్తను చంపడానికి ప్లాన్ వేసి దొరికిపోయిన భార్య
బాధితుడు తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లు మండలం చిలుకోడుకు చెందిన గాదే రాజేశ్వరరావుకు సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన భవానితో 2016లో వివాహం జరగగా, వీరికి ఇద్దరు కూతుళ్లు
రాజేశ్వరరావు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పని చేస్తుండగా, కొరియర్ బాయ్ సైదులుతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య
గత నెల 27న మధ్యాహ్న భోజనం చేసేందుకు ఇంటి వెళ్లి, భార్య భవాని వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండడం చూసి వివాహేతర సంబంధం విషయం తెలుసుకున్న రాజేశ్వరరావు
గత నెల 28న చిలుకోడులో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి, పక్క ఊరిలో ఉంటున్న తన అన్నను తీసుకురావడానికి వెళ్తుండగా రాజేశ్వరరావును వెంబడించిన ప్రియుడు సైదులు
అతని నుండి తప్పించుకొని తిరిగి చిలుకోడు చేరుకుని భవాని ఫోన్ను చెక్ చేసి చూడగా బయటపడ్డ ప్లాన్
వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో తన భర్తను ఎలా అయినా చంపాలని, ఇంట్లో చంపకుండా బయట ఎవరితో అయినా యాక్సిడెంట్ చేయించాలని, లేదంటే తాను చనిపోతానని ప్రియుడు సైదులుకు మెసేజ్లు చేసిన భార్య భవాని
ఆ చాటింగ్ స్క్రీన్షాట్లు తీసుకొని భార్య, ప్రియుడిపై ఈ నెల 1న డోర్నకల్లు స్టేషన్లో ఫిర్యాదు చేసిన భర్త రాజేశ్వరరావు
జీరో ఎఫ్ఐఆర్ బుక్ చేసి కేసును ఖమ్మం రూరల్ స్టేషన్కు బదిలీ చేసిన పోలీసులు
పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లో గురువారం మరోమారు ఫిర్యాదు చేసిన రాజేశ్వరరావు
ఫిర్యాదు అందిందని, కేసు నమోదు చేస్తామని తెలిపిన రూరల్ సీఐ..