సికింద్రాబాద్ బోనాల చెక్కుల పంపిణీలో రసాభాస..
బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకుల మధ్య ప్రోటోకాల్ గొడవ..
ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ రాకుండా చెక్కులు ఎలా పంపిణీ చేశారంటూ ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులు..
ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చెక్కులు పంపిణీ చేయడంపై ఆగ్రహించి సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసిన బీఆర్ఎస్ నాయకులు.
ఓడిపోయిన వాళ్లు స్టేజిపై ఎలా ఉంటారని ప్రశ్నించగా ఒకరినొకరు నెట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు..
ఇరు వర్గాలను అడ్డుకుని బయటకు పంపించిన పోలీసులు..
సికింద్రాబాద్ బోనాల చెక్కుల పంపిణీలో రసాభాస జరిగింది. బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకుల మధ్య ప్రోటోకాల్ గొడవ రేగింది. ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ రాకుండానే చెక్కులను పంచడంపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే లేకుండా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చెక్కులు పంపిణీ చేయడం ఏంటని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఓడిపోయిన వాళ్లు స్టేజిపై ఎలా ఉంటారని అన్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఒకరినొకరు ఒకరినొకరు నెట్టుకున్నారు. ఇరువర్గాలను అడ్డుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్నవారిని బయటకు పంపించారు. కొద్దిసేపు సమావేశంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే పద్మారావు వచ్చిన తరవాత బల్మూరి వెంకట్ ఆయనను ఆహ్వానించారు. తరవాత ఆయన చేత సైతం చెక్కులు పంపిణీ జరిగింది. దీంతో కార్యకర్తలు ఆందోళన విరమించారు.