*సూర్యాపేట జిల్లా..*
మోతె మండల కేంద్రంలో వ్యవసాయ భూమిలో అనుమానస్పద స్థితిలో భార్యభర్తల మృతదేహాలు లభ్యం.
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సూర్యాపేట జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్.
మోతే మండల కేంద్రము సమీపంలో జాతీయ రహదారి వెంట కాళ్ళు చేతులు కనిపించేలా భూమిలో పాక్షికంగా పాతిపెట్టిన మగ, ఆడ మృతదేహాలను పోలీసులు వెలికి తీశారు. సంఘటనా స్థలాన్ని సూర్యాపేట జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్ గారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పి గారు మాట్లాడుతూ భూమిలో పాక్షికంగా పాతిపెట్టిన మృతదేహాలకు సంభందించిన సమాచారాన్ని స్థానిక ప్రజలు సంచారం ఇవ్వగానే డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సిఐ రామకృషా రెడ్డి, స్థానిక ఎస్ఐ, క్లూస్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతి దేహాలను వెలికితీయడం జరిగినది. మృతులు బీక్యాతండా కు చెందిన బూబా, నాగు గా గుర్తించడం జరిగినది, దీనిపై మోతే పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేశాము, ఎవరైనా కొట్టి చంపి ఇక్కడకు తెచ్చి పూడ్చి ఉంటారు అనే కోణంలో విచారణ చేస్తున్నాం, సంఘటనకు పల్పడ్డవారిని పట్టుకుని చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అని వెల్లడించారు.