కొంతమంది కరువు రావాలని కర్ణాటక, తమిళనాడు పోయి అఘోరా పూజలు చేశారు.. CM రేవంత్ రెడ్డి.

కొంతమంది కరువు రావాలని కర్ణాటక, తమిళనాడు పోయి అఘోరా పూజలు చేశారు

నేను గొప్ప తెలివి ఉన్నోడిని, పెద్ద పెద్ద చదువులు చదివినోడిని అని నేను చెప్పను.

కానీ నా సంకల్పం గొప్పది.. దేవుడు నా దిక్కే ఉన్నాడు..

అందుకే హైదరాబాద్‌కు తాగునీటి సమస్య లేకుండా దేవుడే వానలు కురిపించాడు.- సీఎం రేవంత్ రెడ్డి.

రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కరువు రావాలని కొందరు కర్ణాటక, తమిళనాడు వెళ్లి అఘోరా పూజలు చేశారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు గొప్ప తెలివి ఉందని, పెద్ద పెద్ద చదువులు చదివానని చెప్పుకోవడం లేదని అన్నారు.
అయితే తన సంకల్పం గొప్పదని, దేవుడు తన వైపే ఉన్నాడని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు ఇబ్బందులు రాకుండా, ముఖ్యంగా హైదరాబాద్‌కు తాగునీటి సమస్య తలెత్తకుండా దేవుడే వానలు కురిపించాడని వ్యాఖ్యానించారు.
ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే తన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజల సహకారం అవసరమని అన్నారు..