కొత్త పార్టీ ప్రకటించిన విజయసాయి రెడ్డి.. ఈ నెలలోనే కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
“ప్రజల తరపున, ప్రజా పక్షంగా నిలబడేందుకు కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తున్నాను. ఈ నెలలోనే విజయవాడ వేదికగా నా పార్టీ ప్రణాళిక, భవిష్యత్ కార్యాచరణను వెల్లడిస్తా” అని విజయసాయి రెడ్డి తెలిపారు.
కొత్త పార్టీ ఏర్పాటుపై త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. విజయవాడ వేదికగా పార్టీ విధివిధానాలు, భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది..
తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న విజయసాయిరెడ్డి కొత్త పార్టీపై క్లారిటీ ఇచ్చారు. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రజల తరపున, ప్రజల కోసం, ప్రజా పక్షంగా, ప్రజల గొంతు వినిపించేందుకు, నూతన పార్టీని ఏర్పాటు చేస్తున్నానని ప్రకటించారు. నూతన పార్టీ ఏర్పాటుకు సంబంధించిన వ్యవహారాలు ఈ నెలలోనే ప్రారంభిస్తున్నట్టు పేర్కొన్నారు.