సాగర్ఎడమ కాలువకు త్రాగునీరు వెంటనే విడుదల చేయాలి.బిఆర్ఎస్ ఎస్టీ సెల్ అధ్యక్షులు గుగులోతు సందీప్ నాయక్..

గరిడేపల్లి..

మండల కేంద్రంలో ఉన్న తహసిల్దార్ కార్యాలయంలో ఈరోజు మండల తహసీల్దార్ స్రవంతి గారికి సాగర్ ఎడమ కాలువ కింద త్రాగునీరు వెంటనే విడుదల చేయాలని కోరుతూ బిఆర్ఎస్ పార్టీ మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు గుగులోతు సందీప్ నాయక్ గార కుంట తండా గ్రామ శాఖ అధ్యక్షులు నరేందర్ నాయక్ ఆధ్వర్యంలో గ్రామ రైతులతో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది సాగర్ ఎడమ కాలువ కింద ఈ ప్రాంత గ్రామాలలో తాగునీటి కొరకు నీటిని విడుదల చేసి చెరువులు నింపాలనిపశువుల కొరకు తాగునీటిని వెంటనే విడుదల చేయాలని గారకుంట తండ గ్రామ రైతులుతో కలిసి వినతి పత్రం ఇచ్చారు అదేవిధంగా ఈ ప్రాంత రైతుల సౌకర్యార్థం కొరకు నెలకు పది టీఎంసీలు చొప్పున మూడు నెలల పాటు 30 టీఎంసీలు సాగర్ ఎడమ కాలువ కింద విడుదల చేయాలని వారు అన్నారు సాగర్ ఎడమ కాలువ కింద త్రాగునీరు ఇవ్వని పక్షంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గిరిజన సంఘ ఆధ్వర్యంలో అనేక రకమైన ధర్నాలు రాస్తూరోకలు నిర్వహించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేసి అసెంబ్లీ కూడా ముట్టడి చేస్తామని వారు అన్నారు తక్షణమే సాగర్ ఎడమ కాలువ కింద త్రాగునీటి అవసరాల కొరకు నీటిని విడుదల చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో గార కుంట తండా గ్రామ శాఖ అధ్యక్షులు నరేందర్ నాయక్ మాజీ నీటి సంఘం డైరెక్టర్ వెంకట్రాం నాయక్ గ్రామ రైతులు పుల్ సింగ్ నాయక్ గాయకుడు నరసింహలాలు నాయక్ రత్తి రామ్ నాయక్ సైదా నాయక్ లింగ నాయక్ కాలా నాయక్ మహిళా రైతులు మంగతి నాగమ్మ వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు..