గుడిపల్లి మండల కేంద్రంలో వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ కున్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి.. !
గుడిపల్లి మండల కేంద్రంలో వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ కున్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి..
గుడిపల్లి……..
గుడిపల్లి మండల కేంద్రంలో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ కున్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి ముందుగా ఒక మొక్క నాటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు
ఈ సందర్భంగా సర్పంచ్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటి భవిష్యత్తును కాపాడుదాం అనే నినాదంతో ప్రభుత్వం మొక్కలు నాటడం పెంచడంపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమం నిర్వహిస్తుంది అన్నారు మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కాలుష్యాన్ని కట్టడి చేస్తూ మన గ్రామాన్ని హరితమయం చేయాల్సిన అవసరం ఉందన్నారు పచ్చదనం పెంపొందించడంతోపాటు మన గ్రామంలో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం కోసం అటవీశాఖ గ్రామపంచాయతీ గుడిపల్లి ప్రజలు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ అరవపల్లి శ్రీనయ్య వార్డు సభ్యులు ఫీల్డ్ అసిస్టెంట్ భూతం అనిత వి భీ జీ రాంజీ కూలీలు ప్రజలు పాల్గొన్నారు.