‘సారీ అండీ… రాంగ్ నెంబర్’ అంటూ వచ్చిన ఒక్క కాల్… ఓ యువకుడి జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది.
రోజూ గంటల తరబడి ఫోన్లో మాట్లాడిన ఆ యువతి, చివరకు వీడియో కాల్ చేయాలని కోరింది. ఆమె మాటలకు మైమరిచిపోయిన యువకుడు కెమెరా ముందు తన సిక్స్ప్యాక్ బాడీని చూపించాడు. కానీ ఆ క్షణాలన్నింటినీ ఆమె రహస్యంగా రికార్డ్ చేస్తోందని అతడికి తెలియలేదు.
వీడియో కాల్ ముగిసిన వెంటనే ప్రైవేట్ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ బెదిరించి రూ.2 లక్షలు వసూలు చేసింది. అయినా ఆశ తీరక కొద్ది రోజుల తర్వాత మరో రూ.2 లక్షలు డిమాండ్ చేస్తూ మళ్లీ బ్లాక్మెయిల్ చేసింది.
చివరకు విసిగిపోయిన బాధితుడు సైబర్ పోలీసులను ఆశ్రయించగా.. టెక్నికల్ ఆధారాలతో అమృత్సర్లో దాక్కున్న హనీట్రాప్ కిలాడీని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఒక్క ‘రాంగ్ నెంబర్’ కాల్ను నమ్మి మొదలైన పరిచయం… లక్షల రూపాయలు పోగొట్టడంతో పాటు జీవితాన్నే ప్రమాదంలోకి నెట్టింది.