న్యాయవాద వృత్తిలో ప్రతిభకు కాళోజి నంది అవార్డు…
యరగాని సోనీకి అభినందనల వెల్లువ.
హుజూర్నగర్ పట్టణానికి చెందిన యువ న్యాయవాది, నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ యరగాని సోనీ ప్రతిష్టాత్మక కాళోజి నంది అవార్డును అందుకున్నారు.
కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని కాళోజి తెలంగాణ జూనియర్ లేడీ అడ్వకేట్ అసోసియేషన్, కాళోజి తెలంగాణ జేఏసీ సంయుక్త ఆధ్వర్యంలో హనుమకొండలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. జూనియర్ న్యాయవాదిగా ఆమె కనబరిచిన ప్రతిభ, వృత్తిపట్ల అంకితభావాన్ని గుర్తించి కమిటీ ఏకగ్రీవంగా సోనీని అవార్డుకు ఎంపిక చేసింది.
ఈ సందర్భంగా సోనీ తల్లిదండ్రులు యరగాని సత్యనారాయణ గౌడ్, ఉమా, కుటుంబ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు అభినందనలు తెలిపారు. న్యాయవాద వృత్తిలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.