దేవరకొండ స్వర్ణకార సంఘం ఎన్నికల్లో కాసుల వెంకటాచారి 40 ఓట్ల మెజార్టీ తో విజయం.

దేవరకొండ స్వర్ణకార సంఘం ఎన్నికల్లో కాసుల వెంకటాచారి 40 ఓట్ల మెజార్టీ తో విజయం.

స్వర్ణకార సంఘం ఎన్నికల్లో సంచలనం – 40 ఓట్ల మెజారిటీతో ఘన విజయం

దేవరకొండలో బంగారు బాట.. అధ్యక్షుడిగా కాసుల వెంకటాచారి ప్రధాన కార్యదర్శిగా కొండోజు శ్రీనివాసచారి

దేవరకొండ ………..
దేవరకొండ పట్టణ స్వర్ణకార సంఘం (రి.నెం.323/08) ఎన్నికలు-2026 ఉత్కంఠభరితంగా ముగిశాయి. బుధవారం స్థానిక స్వర్ణకార భవనంలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన పోలింగ్ లో సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
మొత్తం 340 ఓట్లకు గాను 329 ఓట్లు పోలయ్యాయి. అందులో 19 ఓట్లు చెల్లనివిగా ప్రకటించగా, 310 ఓట్లు చెల్లుబాటయ్యాయి.
అధ్యక్షుడిగా కాసుల వెంకటాచారి హవా
అధ్యక్ష పదవికి జరిగిన హోరాహోరీ పోరులో కాసుల వెంకటాచారి, బొడ్డుపల్లి వెంకటాచారి బరిలో నిలిచారు. కాసుల వెంకటాచారికి 175 ఓట్లు రాగా, బొడ్డుపల్లి వెంకటాచారికి 135 ఓట్లు వచ్చాయి. 40 ఓట్ల భారీ మెజారిటీతో కాసుల వెంకటాచారి ఘన విజయం సాధించి అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు.
ప్రధాన కార్యదర్శిగా కొండోజు శ్రీనివాసాచారి
ప్రధాన కార్యదర్శి పదవికి వింజమూరి ప్రవీణ్ కుమార్, కొండోజు శ్రీనివాసాచారి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కొండోజు శ్రీనివాసాచారికి 162 ఓట్లు, వింజమూరి ప్రవీణ్ కుమార్ కు 148 ఓట్లు వచ్చాయి. 14 ఓట్ల మెజారిటీతో కొండోజు శ్రీనివాసాచారి విజయకేతనం ఎగురవేశారు.
ఎన్నికల అనంతరం నూతన అధ్యక్షుడు కాసుల వెంకటాచారి, ప్రధాన కార్యదర్శి కొండోజు శ్రీనివాసాచారిలను సంగం పెద్దలు చేపూరి జగన్ చారి (స్వర్ణకారసంఘం భవన అధ్యక్షుడు), విఠల్ చారి, కూరల్లా కృష్ణ చారి, ఆహ్వాన కమిటీ అధ్యక్షుడు మహేశ్వరం వేణుగోపాల చారి, శ్రీరాం హౌస్ శ్రీనివాస్ చారి, మహేశ్వరం బ్రహ్మచారి, నరసింహచారి తదితరులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం పట్టణంలో భారీ విజయ ర్యాలీ నిర్వహించారు. అధ్యక్షుడు మాట్లాడుతూ నా గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తూ సంఘం కోసం ఎనలేని సేవ నిర్వహిస్తానని తెలిపారు..