BRSV రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల రాజును ముందస్తుగా అరెస్ట్ చేసిన పోలీసులు..
దేవరకొండ…….
బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఆందోళన కార్యక్రమం నేపథ్యంలో దేవరకొండ పోలీసులు బిఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల రాజును ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
ఆందోళన కార్యక్రమంలో పాల్గొనకుండా అడ్డుకునే ఉద్దేశంతో పోలీసులు ముందస్తు అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని వేముల రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికీ ఉందని అన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులను అరెస్టులతో అణచివేయడం సరికాదని, ప్రజా ఉద్యమాలను పోలీసుల ద్వారా అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఎన్ని నిర్బంధాలు, అరెస్టులు చేసినా ప్రజా సమస్యలపై తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు..
ఈ సందర్భంగా బి ఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రజా సమస్యలపై తమ పోరాటాన్ని కొనసాగించాలని వేముల రాజు పిలుపునిచ్చారు.
వేములరాజు ను అరెస్ట్ చేయడం పట్ల BRS పార్టీ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్ ఖండిoచారు. తక్షణమే విడుదల చేయాలనీ డిమాండు చేశారు.