తీదేడు గ్రామంలో ఘనంగా వైద్య శిబిరం
కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు
– ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి
– తీదేడు గ్రామ సర్పంచ్
చింతపల్లి………
గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో హైదరాబాద్ కామినేని హాస్పిటల్ వారి సౌజన్యంతో చింతపల్లి మండలం తీదేడు గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి ప్రారంభించారు.
ఈ వైద్య శిబిరంలో కామినేని హాస్పిటల్కు చెందిన నిపుణులైన వైద్యులు మరియు వైద్య సిబ్బంది పాల్గొని గ్రామ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు.వివిధ ఆరోగ్య సమస్యలపై ప్రజలకు వైద్య సలహాలు అందించడంతో పాటు, అవసరమైన వారికి తగిన చికిత్స, మందులు మరియు ఆరోగ్య పరిరక్షణపై సూచనలు అందించారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రజలు వైద్య పరీక్షల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా,వారి గ్రామంలోనే వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం ఈ శిబిరం ప్రత్యేకతగా నిలిచిందన్నారు.పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు వైద్య శిబిరానికి హాజరై తమ ఆరోగ్య సమస్యలను వైద్యులతో సంప్రదించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ… ప్రజల ఆరోగ్యమే ప్రధాన లక్ష్యంగా ఇలాంటి వైద్య శిబిరాలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కామినేని హాస్పిటల్ యాజమాన్యం, వైద్యులు మరియు సిబ్బందికి గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు, ఆరోగ్య అవగాహన మరియు అవసరమైన వైద్య సూచనలు అందించడంలో ఈ శిబిరం ఎంతో ఉపయోగకరంగా నిలిచిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేస్తామని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బొడ్డు పార్వతమ్మ యాదగిరి, మాదగోని కృష్ణ గౌడ్, గంటెల అలివేలు సోమయ్య, దాసరి కళమ్మ ముత్తయ్య, రెడ్డి పద్మ పరమేష్, శివర్ల పర్వతాలు యాదవ్, కామినేని హాస్పిటల్ వైద్య బృందం,గ్రామపంచాయతీ సిబ్బంది,గ్రామ పెద్దలు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.