గుడిపల్లిలో ఆరోగ్య సంజీవని సర్పంచ్ ఆధ్వర్యంలో 500 మందికి ఉచిత మెగా హెల్త్ క్యాంప్
ప్రజా ఆరోగ్యమే పరమావధి యశోద ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం సక్సెస్
అడగగానే కాదనకుండా గుడిపల్లి వాసులకు యశోద హాస్పిటల్ ఉచిత సేవలు
గుడిపల్లి………
గుడిపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మెగా ఉచిత హెల్త్ క్యాంప్ ఘనంగా నిర్వహించారు.
గుడిపల్లి గ్రామ సర్పంచ్ కున్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో, ప్రముఖ యశోద హాస్పిటల్ వైద్య బృందం సహకారంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. డాక్టర్లు వీరారెడ్డి,ఆర్థో నిపుణులు అమీరా గైనకాలజిస్ట్, మధుర దుర్గా మరియు వారి బృందం గ్రామస్తులకు వైద్య సేవలు అందించారు.
ఈ క్యాంప్ లో భాగంగా కంటి పరీక్షలు, గర్భిణీ స్త్రీలకు గైనక్ పరీక్షలు, ECG, BP, షుగర్ పరీక్షలు పూర్తి ఉచితంగా నిర్వహించారు. అంతేకాకుండా అవసరమైన వారికి కళ్ళద్దాలు, మందులను కూడా ఉచితంగా పంపిణీ చేశారు. ఒకవేళ ఎవరికైనా మేజర్ హెల్త్ ప్రాబ్లం ఉంటే, క్యాంప్ లో ఇచ్చిన OP స్లిప్ తీసుకువస్తే యశోద హాస్పిటల్ లో 20% డిస్కౌంట్ ఇస్తామని వైద్యులు హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా సర్పంచ్ కూన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. మా గ్రామ ప్రజల ఆరోగ్యం కోసం అడగగానే ఉచిత క్యాంప్ నిర్వహించడానికి ముందుకు వచ్చిన యశోద హాస్పిటల్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఒక్కరోజే దాదాపు 500 మంది గ్రామస్తులు ఈ సేవలను వినియోగించుకున్నారు. మా ప్రజలకు ఎలాంటి హాని జరగకూడదనే ముందు జాగ్రత్తగా ఈ చెకప్ లు చేయిస్తున్నాం. అలాగే మా పాఠశాలలో విద్యార్థులకు ప్రతి బుధ వారం చికెన్ కూడా అందిస్తున్నాం అని తెలిపారు
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కున్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ ముఖ్య సలహాదారులు ఆర్వపల్లి నరసింహ తదితరులు పాల్గొన్నారు..
గ్రామస్తులు ఈ కార్యక్రమం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సర్పంచ్ కు కృతజ్ఞతలు తెలియజేసినారు.