దేవరకొండ ……..
దేవరకొండ పెన్షనర్స్ సేవా సధనంలో ఈ రోజు జిల్లా కార్యవర్గం సభ్యులు బొలుసాని సత్యనారాయణ, మండల కార్యవర్గం సభ్యులు మహమ్మద్ మౌలానా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగినది. బొలుసాని సత్యనారాయణ తన పుట్టినరోజు సందర్బంగా స్థానిక హ్యాండిక్యాప్డ్ మహిళకు రూ. 500 అందజేసినారు.
ఈ సందర్బంగా హాజరైన సభ్యులకు స్వీట్, తేనిరు అందజేసినారు. వారు మాట్లాడుతూ మా పుట్టినరోజు వేడుక నిర్వహించడం సంతోషం కలిగింది అన్నారు.
ఈ కార్యక్రమంలో కార్యదర్శి అంకం చంద్రమౌళి, కోశాధికారి పంగనూరు లింగయ్య, జిల్లా ఉపాధ్యక్షులు కంచర్ల నారాయణ రెడ్డి, సంయుక్త కార్యదర్శి వనం బుచ్చయ్య, కార్యనిర్వాహాక కార్యదర్శి మహమ్మద్ యూసుఫ్ షరీఫ్, మోటమర్రి పురుషోత్తం,నందులాల్, అలంపల్లి శ్రీనివాసులు, నక్క కొండయ్య సభ్యులు పాలుగోని శుభాకాంక్షలు తెలియజేసినారు.