కోర్కెలు తీర్చే బృందావన గణపతి.. లడ్డూ కోసం దూర ప్రాంతాల నుంచి తరలివస్తున్న దంపతులు
మూడో ఏడాది మరింత వైభవంగా.. భక్తజన సందోహంలో బృందావన కాలనీ వినాయక నవరాత్రులు
భక్తుల కొంగు బంగారంగా బృందావన గణేషుడు..
దేవరకొండ………
దేవరకొండ లో బృందావన్ కాలనీలో ఘనంగా మూడవ వార్షిక గణేష్ నవరాత్రులు
బృందావన్ కాలనీ ఆధ్వర్యంలో మూడవ సంవత్సరం వినాయక నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
కాలనీ అధ్యక్షుడు సపావత్ చిన్నా నాయక్, ప్రధాన కార్యదర్శి కనుగుల ఆంజనేయులు, కోశాధికారి పెరిగంటి నరేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి మండపం భక్తులతో కిటకిటలాడుతోంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు.
ఇక్కడి గణేశుడికి ఒక ప్రత్యేక నమ్మకం ఉందని స్థానికులు చెబుతున్నారు. సంతానం లేని దంపతులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడి లడ్డూ వేలం పాటలో పాల్గొంటారని, స్వామివారి లడ్డూ ప్రసాదం పొందితే తమ కోరిక నెరవేరుతుందని వారి ప్రగాఢ విశ్వాసం.
ఈ సందర్భంగా అధ్యక్షుడు సపావత్ చిన్నా నాయక్ మాట్లాడుతూ… “మా బృందావన కాలనీలో వరుసగా మూడవ సంవత్సరం కూడా గణపతిని నిలబెట్టాం. ప్రతి ఏటా భక్తుల సంఖ్య పెరుగుతోంది. తొమ్మిది రోజులు పూజల అనంతరం ఇక్కడ వచ్చిన భక్తులందరికీ అన్నప్రసాదం(అన్నదానం) నిర్వహిస్తామని అధ్యక్షులు తెలియజేసినారు
ఈ కార్యక్రమంలో రాజు (DL), ఏ.ఎల్లయ్య, రంగా నాయక్ (ఫిజికల్ డైరెక్టర్) లక్ష్మాచారి, రామావత్ టక్రూ, RTC భాస్కర్, RTC శ్రీనివాస్, ఆంజనేయులు స్వామి, భారత్, హరిలాల్, రాజు ఏఇ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.