శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో చివరి రోజు విగ్నేశ్వరునికి మధ్యాహ్నం పూజలు..!

దేవరకొండ………..
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో 9 వ రోజు మధ్యాహ్నం ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో దేవాలయం ప్రధాన అర్చకులు
ఘంటసాల సుబ్రహ్మణ్య శర్మ వారి శిష్య బృందం చే కనుల పండుగ గా విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించినారు.
ఆలయ కమిటీ వారు మహిళ వృద్ధ ఆశ్రమంలో
వృద్ధుల కోసం మహా ప్రసాదం ప్రత్యేకంగా వండించి వృద్ధామాతలకు మధ్యాహ్నం ఆలయ కమిటీ వారు వెళ్లి స్వయంగా వృద్ధ మాతలకు ఒడ్డన చేసినారు
వృద్ధులు ఆ వినాయకునీ మహా ప్రసాదం మాకు కల్పించినందుకు ఆర్యవైశ్య సంఘం వారు చాలా గొప్ప మనసు ఉండి ఆ విగ్నేశ్వరుని ప్రసాదం మాకు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేసినారు.
ఆలయం కు వచ్చిన భక్తులందరికీ మహా ప్రసాదం ఏర్పాట్లు ఆలయ కమిటీ వారు నిర్వహించినారు.
ఈ కార్యక్రమంలో దేవాలయం అధ్యక్షులు
చీదెళ్ల వెంకటేశ్వర్లు, కార్యదర్శి సముద్రాల ప్రభాకర్, కోశాధికారి నీలా అశోక్ ఆర్యవైశ్య సంఘం సభ్యులు, ఆర్యవైశ్య మహిళా సంఘం సభ్యురాలు తదితరులు పాల్గొన్నారు.