ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణాల సంఖ్య మూడుకు చేరుకుంది. పొగ వ్యాపించి శ్వాస ఆడక ఇబ్బంది పడుతూ ఇచ్చోడకు చెందిన ఓ శిశువు మృతి చెందగా.. మరికొందరిని మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరో శిశువు మృతి చెందింది. తాజాగా ఇంద్రవెల్లి మండలంలోని గిన్నెర గ్రామానికి చెందిన కుమ్ర శెకుబాయి దినేష్ దంపతుల 15రోజుల నవ జాత శిశువు సైతం చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపేరు…
ఆదిలాబాద్ రిమ్స్ (Adilabad RIMS) ఆసుపత్రిలో జరిగిన ప్రమాద ఘటనలో బాధితులైన చిన్నారుల ఆరోగ్యం మరింత ఆందోళనకరంగా మారుతోంది. ప్రాథమిక చికిత్స పొందుతున్న వారిలో తాజాగా మరో ఏడుగురు చిన్నారుల పరిస్థితి విషమించడంతో వైద్య వర్గాల్లో తీవ్ర కలవరం రేపింది. ఈ పరిణామంతో అప్రమత్తమైన వైద్యులు, అధికారులు అప్రమత్తం అయ్యారు…
చికిత్స పొందుతున్న వారిలో ఏడుగురి పరిస్థితి విషమించడంతో వారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రికి తరలిస్తున్నారు. రిమ్స్‌లో మరో 15 మంది చిన్నారులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చింది. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ, మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు ముమ్మరం చేశారు..
రిమ్స్‌లో చికిత్స పొందుతున్న చిన్నారులలో ఏడుగురి ఆరోగ్యం క్షీణించడంతో స్థానిక వైద్యులు వెంటనే స్పందించారు. మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో వారిని హుటాహుటిన నాలుగు ప్రత్యేక వాహనాలలో హైదరాబాద్ (Hyderabad)లోని నీలోఫర్ (Niloufer) ఆసుపత్రికి తరలిస్తున్నారు. అక్కడ అత్యవసర వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగనుంది. మరోవైపు, ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసుపత్రిలో ప్రస్తుతం మరో 15 మంది చిన్నారులు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. వారికి ఎలాంటి ప్రాణాపాయం లేకుండా నిపుణులైన వైద్యుల బృందం సేవనందిస్తోంది. ప్రమాద ఘటనకు సంబంధించి బాధితులకు ప్రభుత్వం ఇప్పటికే అండగా నిలుస్తామని భరోసా ఇచ్చిన విషయం తెలిసిందే. తాజా, పరిణామాల నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు ముమ్మరం చేశారు.