ఐక్యరాజ్యసమితి లో భారత్ కు శాశ్వత సభ్యత్వం అవకాశం కల్పించాలి.. రష్యా..

అంతర్జాతీయ అత్యున్నత వేదికలో పాశ్చాత్య దేశాలకు అదనపు స్థానాలు కేటాయించడాన్ని తాము అంగీకరించబోమని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ తేల్చిచెప్పారు…ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (UNGA)లో శనివారం ఆయన ప్రసంగిస్తూ, ప్రపంచ వేదికలో సంస్కరణలు చేపడితే అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలకు మరింత ప్రాతినిధ్యం కల్పించాలని గళమెత్తారు.

భద్రతా మండలి విస్తరణ జరిగితే అది ప్రధానంగా ఆసియా, ఆఫ్రికా మరియు లాటిన్ అమెరికా దేశాలపైనే దృష్టి పెట్టాలని, అంతేగానీ పశ్చిమ దేశాలకు మరిన్ని శాశ్వత సభ్యత్వాలు ఇవ్వకూడదని లావ్రోవ్ పేర్కొన్నారు. “యూఎన్ భద్రతా మండలి సంస్కరణల పేరిట పశ్చిమ దేశాలకు, ప్రత్యేకించి జర్మనీ, జపాన్‌లకు అదనపు స్థానాలు కేటాయించడం సమంజసం కాదు. మేము ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా ప్రాంతాల ప్రాతినిధ్యాన్ని విస్తరించడానికి అనుకూలం. శాశ్వత సభ్యత్వం కోసం బ్రెజిల్, భారత్ అభ్యర్థిత్వాలకు రష్యా పూర్తి మద్దతు ఇస్తుంది” అని లావ్రోవ్ స్పష్టం చేశారు..
ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో వీటో అధికారం కలిగిన అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ అనే 5 దేశాలు శాశ్వత సభ్యులుగా ఉన్నాయి. వీటితో పాటు రెండేళ్ల కాలపరిమితితో ఎన్నికయ్యే 10 తాత్కాలిక సభ్య దేశాలు ఉంటాయి. భద్రతా మండలి కూర్పును సంస్కరించి విస్తరించాలంటే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో మూడింట రెండొంతుల (2/3) మెజారిటీతో ఆమోదం పొందాలి. ఆ తర్వాత ఐదు శాశ్వత సభ్య దేశాలతో కలిపి మొత్తం యూఎన్ సభ్య దేశాల్లో మూడింట రెండొంతుల దేశాలు దీన్ని ఆమోదించాల్సి (ర్యాటిఫై) ఉంటుంది.

గతంలో జైశంకర్‌తో సమావేశం పాల్గొన్న విషయం అందరికీ తెలిసిందే.. అనంతరం స్లోవేకియా విదేశాంగ మంత్రి జురాజ్ బ్లనార్ బలతీలకమైన వ్యాఖ్యలు చేశారు “V4 దేశాలుగా ఉన్న తమ నాలుగు దేశాలు ‘గ్లోబల్ సౌత్’లో కీలక భాగస్వామిగా, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్న అగ్రరాజ్యంగా ఉన్న భారత్‌ను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యునిగా చేర్చుకోవాలని మేము ఏకగ్రీవంగా అంగీకరిస్తున్నామని తెలిపారు.