రీల్ మోజులో ప్రమాదకర బైక్ స్టంట్.. రూ.45వేల జరిమానా
హర్యానా రాష్ట్రం, పంచకుల జిల్లా, చండీమందిర్ టోల్ ప్లాజా వద్ద బైక్‌తో ఓ యువకుడు ప్రమాదకర స్టంట్లు
అతివేగంగా బైక్ నడుపుతూ.. ఆపై దాని మీద నిల్చొని హీరోలా పోజులు ఇచ్చేందుకు యువకుడు ప్రయత్నం
ఈ క్రమంలోనే పట్టు తప్పి యువకుడు కింద పడిపోగా.. కొంతదూరం వెళ్లి డివైడర్‌ను బలంగా ఢీకొన్న బైక్
ఇన్‌స్టా రీల్ కోసమని యువకుడు స్టంట్ చేయగా.. కింద పడ్డ వీడియోనే నెట్టింట్లో పోస్ట్ చేసిన వైనం
ఈ వీడియో పోలీసుల దృష్టికి రావడంతో.. వారిని గుర్తించి రెండు బైక్‌లపై కలిపి రూ.45 వేల చలాన్ల విధింపు
స్టంట్ చేసిన బైక్‌కి రూ.25 వేలు, వీడియో రికార్డ్ చేస్తూ నడిపిన మరో బైక్‌పై రూ.20 వేల జరిమానా
రెండు బైక్‌లను సీజ్ చేసి.. ఇలాంటి స్టంట్స్ చేయడం సరికాదని వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిన పోలీసులు..
హర్యానాలోని పంచకుల జిల్లాలో, చండీమందిర్ టోల్ ప్లాజా వద్ద ఓ యువకుడు ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం అతివేగంగా బైక్ నడుపుతూ, దానిపై నిల్చొని ప్రమాదకర స్టంట్లు చేశాడు. ఈ కింద పడిపోయిన యువకుడి వీడియో పోలీసుల దృష్టికి రావడంతో, స్టంట్ చేసిన యువకుడితో పాటు వీడియో రికార్డ్ చేస్తూ మరో బైక్ నడిపిన వారిపై మొత్తం రూ.45 వేల జరిమానా విధించారు.