డిండి ఆయకట్టు రైతుల సమస్యను రాష్ట్ర అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్లిన బీజేపీ నాయకులు..

.

దేవరకొండ…………
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్ర రావు నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ పర్యటనకు విచ్చేసిన సందర్భంగా బీజేపీ నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి డిండి ఆయకట్టు రైతుల సాగునీటి సమస్యను వివరించారు.
డిండి ఆయకట్టు పరిధిలో సుమారు 12,500 ఎకరాల్లో వరి పంట సాగవుతోందని, ప్రస్తుతం పంటకు కీలకమైన సమయంలో నీటి కొరత ఏర్పడటంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని బీజేపీ రాష్ట్ర నాయకులు కేతావత్ లాలు నాయక్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్ర రావు దృష్టికి తీసుకెళ్లారు.
సాగు చేసిన వరి పంటకు కీలక దశలో సమయానికి నీరు అందకపోతే వేలాది ఎకరాల్లో పంట దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని వారు వివరించారు. డిండి ఆయకట్టు రైతుల పంటలను కాపాడేందుకు తక్షణమే సాగునీటి సమస్యకు పరిష్కారం చూపేలా సంబంధిత అధికారులతో మాట్లాడాలని రాష్ట్ర అధ్యక్షులను కోరారు.
రైతుల సమస్యను రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్ర రావు కి వివరించిన వారిలో బీజేపీ సీనియర్ నాయకులు నక్క వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షులు వానం నరేందర్ రెడ్డి, జిల్లా ఐటీ సెల్ కన్వీనర్ జల్దా భాస్కర్, కందుకూరు సర్పంచ్ బరపటి కొండల్, మండల అధ్యక్షులు వినోద్ చారి, నాగిళ్ల ఆంజనేయులు, గోలి శ్యామ్, ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి చిత్రం ఉదయ్, చిలక రాజు బిక్కు, కుంభం వెంకటేష్, ఉప్పునూతల ప్రసాద్ తదితరులు ఉన్నారు.